కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
బ్రిటన్‌లో పెంపుడు కుక్క లాలాజలం వల్ల ఒక మహిళ జీవితం తలకిందులైంది. చిన్న గాయాన్ని కుక్క నాకడంతో సెప్సిస్ బారిన పడి, కాళ్లు, చేతులు కోల్పోయింది. 32 వారాలు ఆసుపత్రిలో నరకయాతన అనుభవించి, ప్రాణాలతో బయటపడింది. పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాలని, గాయాలపై వాటి లాలాజలం పడకుండా చూడాలని ఈ ఘటన గంభీరంగా హెచ్చరిస్తోంది.
బ్రిటన్‌లో పెంపుడు కుక్క కారణంగా ఓ మహిళ జీవితం తలకిందులైంది. శరీరంపై చిన్న గాయాన్ని కుక్క నాకడం వల్ల ఆమె సెస్పిస్‌కు గురైంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలై.. కాళ్లు, చేతులు కోల్పోయింది. 32 వారాల పాటు ఆస్పత్రిలో నరకం చూసింది. 2025 జూలైలో లండన్‌కు చెందిన మంజిత్ సంఘా అనే మహిళకు చిన్న గాయం అయింది. శనివారం కుక్కతో ఆడుకుంటున్న సమయంలో అది ఆమె గాయాన్ని నాకింది. దీంతో ఆమెకు సెస్పిస్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ ఆమె శరీరంపై చాలా వేగంగా ప్రభావం చూపింది. ఆదివారం రోజు ఆఫీస్‌కు వెళ్లిన ఆమె.. ఆరోగ్యం బాగోలేకపోవటంతో మధ్యాహ్నమే ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి పరిస్థితి విషమించింది. రాత్రికి మంజిత్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాళ్లు చేతులు చల్లగా అయిపోయాయి. పెదాల రంగు మారిపోయింది. ఊపిరి తీసుకోవటానికి కూడా ఇబ్బందిపడింది. దీంతో భర్త కమల్‌జిత్ ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స అందించారు. సెస్పిస్ కారణంగా ఇన్ఫెక్ట్ అయిన కాళ్లు, చేతులను సగం వరకు తొలగించారు. ఆస్పత్రిలో ఆమె 32 వారాల పాటు ఉంది. ఆ సమయంలో ఆరు సార్లు ఆమెకు గుండెపోటు వచ్చింది. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడింది. తాజాగా.. మంజిత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. ఆమె భర్త ఏం చెప్పారంటే.. తనకు అస్సలు అర్థం కావటం లేదనీ కేవలం 24 గంటల్లో ఇంత దారుణంగా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. శనివారం తను కుక్కతో ఆడుకుంది.. ఆదివారం డ్యూటీకి వెళ్లింది.. సోమవారం రాత్రి కోమాలోకి వెళ్లిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 32 వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన మంజిత్, ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. పెంపుడు జంతువులతో ఆడుకునేటప్పుడు, వాటి లాలాజలం గాయాలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bermuda Triangle: బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. కుటుంబ పోషణ కోసం తపన..చివరికి ఇలా
Mamta Mohandas: ‘రాజమౌళి అలా అనేసరికి నా గుండె పగిలిపోయింది’
Auto Ram Prasad: డైరెక్టర్‌గా కొత్త జర్నీ.. మొదలు పెట్టిన ఆటో రాంప్రసాద్
Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF హీరో లుక్‌పై కామెడీ సెటైర్లు
వచ్చిన పార్సిల్.. తెరిచి చూసి భయంతో వణికిన మహిళ..
పాత స్మార్ట్ఫోన్లలో విలువైన గోల్డ్.. భవిష్యత్ కోసం
కుక్క నాకడంతో ఇన్ఫెక్షన్.. సగం కాళ్లు, చేతులు కోల్పోయిన మహిళ
బెర్ముడా ట్రయాంగిల్ మరణాలకు కారణం అదేనా ??
పగలు కానిస్టేబుల్‌గా, రాత్రి ర్యాపిడో రైడర్‌గా.. చివరికి ఇలా
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..
గ్రామ సర్పంచ్ ఇంటిముందు క్షుద్రపూజలు

