వాగులోకి దూసుకెళ్లిన బస్సు.. బస్సులో 37 మంది..
అదిలాబాద్ జిల్లా శ్యాంపూర్ బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. పొగమంచు, ఇరుకు వంతెనే దీనికి కారణం. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడినప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కండక్టర్ సహా 25 మందికి పైగా గాయపడ్డారు. మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు లోయలోకి దూసుకెళ్ళింది. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ఫిబ్రవరి 23 సోమవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాందలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆదిలాబాద్ నుండి ఆసిఫాబాద్‌కు 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, శ్యాంపూర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. ఉట్నూరు మండలం శ్యాంపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు కురుస్తుండటం, దానికి తోడు వంతెన అత్యంత ఇరుకుగా ఉండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో బస్సు నేరుగా వాగులోకి పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, ప్రయాణికులను బస్సు కిటికీల గుండా బయటకు తీశారు. ఈ ఘటనలో కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ వెంటనే ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వంతెనపై సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని అధికారులు మంత్రులకు నివేదించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు
‘ఏఐ’ రాకతో.. వారిని తొలగించా !! మానసిక క్షోభతో యజమాని కన్నీరు !!
మెక్సికోలో డ్రగ్స్ డాన్ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

