AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్‌ను రూల్‌ చేస్తున్న నయా ట్రెండ్‌

బాలీవుడ్‌ను రూల్‌ చేస్తున్న నయా ట్రెండ్‌

Samatha J
|

Updated on: Oct 23, 2026 | 11:35 AM

Share

ఒకప్పుడు ప్రేమ కథలు, ఫ్యామిలీ డ్రామాలతో బాలీవుడ్ స్టార్లు రాణించారు. ఇప్పుడు జానర్ మార్చారు. యాక్షన్, థ్రిల్లర్, హారర్ కామెడీ వంటి విభిన్న కథాంశాలతో గ్లోబల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. షారుక్ ఖాన్, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్ వంటి స్టార్లంతా తమ ఇమేజ్‌ను పక్కనపెట్టి కొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్నారు.

ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రేమ కథలు, ఫ్యామిలీ డ్రామాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. కథ ఎలా ఉన్నా, స్టార్ హీరోలు కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేవారు. అయితే, ఇప్పుడు ఈ ట్రెండ్ పూర్తిగా మారింది. ఒకప్పుడు రొమాంటిక్, కమర్షియల్ ఫార్ములాకు అంకితమైన స్టార్లు ఇప్పుడు నయా జానర్‌లను ప్రయత్నిస్తున్నారు. గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా యాక్షన్, థ్రిల్లర్, హారర్-కామెడీ వంటి విభిన్న జానర్‌లపై దృష్టి సారించారు. రొమాంటిక్ కింగ్‌గా పేరుగాంచిన షారుక్ ఖాన్ కూడా కింగ్ సినిమా కోసం పవర్‌ఫుల్ అస్సాసిన్‌గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. జాన్ అబ్రహం గురు వంటి థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఏకంగా జాంబీ థ్రిల్లర్ ప్రళయ్తో నిర్మాతగా మారారు. అజయ్ దేవగన్ దృశ్యం 3 వంటి క్రైమ్ థ్రిల్లర్లతో విజయాలు అందుకున్నారు. అక్షయ్ కుమార్ సైతం హారర్-కామెడీ థ్రిల్లర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

Follow Us