టీమిండియాలో అసలైన డేంజర్ ఇతడే.. ఆపకుంటే ట్రోఫీనే కాదు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేరంతే..!
Naman Dhir: టీమిండియాకు నమన్ ధీర్ రూపంలో మరో విధ్వంసకర బ్యాటర్ లభించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో 15 బంతుల్లో 42 పరుగులు చేసి అద్భుతమైన ఫినిషింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఈ యువ ఆటగాడిని సైమన్ డౌల్ ఎంతగానో కొనియాడాడు. కివీస్ బౌలర్లకు హెచ్చరిక కూడా జారీ చేశాడు.

Naman Dhir: టీమిండియాకు నమన్ ధీర్ రూపంలో అద్భుతమైన, విధ్వంసకర బ్యాటర్ దొరికాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. విండీస్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచులలో నమన్ ధీర్ ప్రదర్శన అతనిలోని గొప్ప టాలెంట్‌ను స్పష్టం చేస్తోంది. కీలక సమయంలో అగ్రెసివ్ గా ఆడుతూ జట్టుకు విలువైన పరుగులు చేస్తున్న ఈ యువ ఆటగాడు టీమిండియాకు ఫినిషర్ గా కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణిస్తున్న నమన్ టీమిండియాలో నమ్మకమైన ఆల్ రౌండర్ గా దూసుకెళ్తున్నాడు.
మొన్న వెస్టిండీస్ తో చివరి మ్యాచ్ లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఈ టీం ఇండియా స్పిన్ ఆల్ రౌండర్, నిన్న న్యూజిలాండ్ పై తొలి టీ20లో తన ఫినిషింగ్ స్కిల్స్ తో అదరగొట్టాడు. కేవలం 15 బంతుల్లోనే 42 పరుగులతో అజయంగా నిలిచాడు. ఇందులో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో కివీస్ బౌలర్లపై ఒత్తిడి పెంచి టీమిండియాకు త్రిల్లింగ్ విక్టరీ అందించాడు. నమన్ ధీర్ బ్యాటింగ్ ను కొనియాడుతూ న్యూజిలాండ్ బౌలర్లకు సైమన్ డౌల్ హెచ్చరికలు జారీ చేశాడు.
భారీ షాట్లు ఆడడం మాత్రమే సరిపోదని, మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకొని అవసరమైనప్పుడు వికెట్లను కాపాడుకోవడం, చివరి ఓవర్లలో స్కోర్ వేగాన్ని పెంచడం కూడా టీ20లో చాలా కీలకం అని పేర్కొన్నాడు. అది ఈరోజు నమన్ ధీర్ తన బ్యాటింగ్ తీరుతో చేసి చూపించాడని, చివరి అంకంలో ఒత్తిడికి గురికాకుండా అతడు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని కొనియాడాడు.
ఇక రేపు రెండో టీ20 లో ఇదే పిచ్ పై న్యూజిలాండ్ బౌలర్లు అతన్ని అడ్డుకోకపోతే మరో ఓటమి కాయమంటూ తమ బౌలర్లను సైమన్ డౌల్ హెచ్చరించాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ విధించిన 226 పరుగుల టార్గెట్ ను టీమిండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసి సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది.
ఎక్కువమంది చదివినది: శాంసన్, అయ్యర్ కాదు.. 15 బంతుల్లో మ్యాచ్ రిజల్ట్ మార్చేసిన రోహిత్ ఫ్రెండ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
