మేడారంలో జరిగే శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ జాతర 2027 తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి. ములుగు జిల్లాలోని ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీలలో నాలుగు రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయి. మేడారంలోని పూజారుల సంఘం సభ్యులు ఈ తేదీలను వెల్లడించారు. పూర్తిగా ఆదివాసీ ఆచార వ్యవహారాల ప్రకారం జరిగే ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.