AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?

కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?

Samatha J
|

Updated on: Sep 28, 2026 | 1:03 PM

Share

శబరిమల ఆలయంలో బంగారం మాయంపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల బంగారు కిరీటం బరువులో తేడాలు కలకలం రేపగా, అంతకుముందు ద్వారపాలకుల విగ్రహాల బంగారు పూతలో 4.5 కిలోలకు పైగా బంగారం తగ్గిందని వెల్లడైంది. ఈ రెండు సంఘటనలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దేవస్థానం పారదర్శకత, భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న బంగారు ఆభరణాల వివాదాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వామి సన్నిధానంలో బంగారు కిరీటం బరువులో తేడాలు బయటపడటం తాజా ఘటనగా నమోదైంది. 2012లో భక్తుడు సమర్పించిన 445.78 గ్రాముల కిరీటం, తనిఖీల్లో కేవలం 240 గ్రాములే ఉన్నట్లు తేలడంతో బంగారం మాయమైందనే అనుమానాలు రేకెత్తాయి. అయితే, తిరువాభరణం కమిషనర్ దీనిని ఖండిస్తూ, తొలుత గందరగోళం వల్ల అలా భావించినట్లు, కిరీటం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గతంలోనూ ఇలాంటి వివాదమే శబరిమలలో చోటుచేసుకుంది. గర్భగుడి ద్వారపాలకుల విగ్రహాలపై ఉన్న బంగారు పూత రేకుల మరమ్మతుల పేరుతో తొలగించినప్పుడు సుమారు 4.5 కిలోలకు పైగా బంగారం మాయమైనట్లు తేలింది. ఆలయం నుంచి తీసుకెళ్లినప్పుడు 42.8 కేజీలు ఉన్న తాపడాలు, చెన్నై సంస్థకు చేరేసరికి 38.28 కిలోలకు పడిపోయాయి. ఈ రెండు వివాదాలపైనా హైకోర్టు సీరియస్‌గా స్పందించి ఆదేశాలు జారీ చేసింది. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల భద్రత, పారదర్శకతపై దేవస్థానం మరింత శ్రద్ధ వహించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

నాని ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే?

ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే సూపర్ మూవీస్ ఇవే

చిరంజీవి మామూలోడు కాదు.. అన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు..!

Follow Us