Andhra Pradesh: సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్ దాకా.. ఏపీలో తగ్గనంటున్న పొలిటికల్ ఫీవర్..
గ్రౌండ్ లోకల్ ఐనా.. సౌండ్ మాత్రం స్టేట్‌వైడే. గల్లీల్లో ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే, రాజధాని రేంజ్‌లో రాజుకుంటోంది రాజకీయం. ఒకటిపోతే ఒకటి.. ఇష్యూ ఏదైనా సైజుతో సంబంధం లేకుండా నషాళం దాకా రగులుకుంటోంది రచ్చ. కామెంట్లు, కౌంటర్లతో ఇంచైనా తగ్గే మూడ్‌లో లేవు పార్టీలు. స్థానిక ఎన్నికల సీజన్‌కి సరిపడా సరంజామా సర్దుకుంటూ, మైలేజ్ వేటలో దూసుకుపోతున్నారు లీడర్లు. ఏపీలో వన్నాట్ ఫోర్ సెల్సియస్ దాటిన రైవల్ ఫీవర్లు. డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం..

స్థానిక సమరానికి అన్నీ మంచి శకునములే అనుకున్నారు మొదట్లో. ఎలక్షన్ కమిషన్ రెడీ అంటే, కూటమి ప్రభుత్వం ఎవరెడీ అనేసింది. కానీ, దేవుడు వరమిచ్చినా, పూజారి కాదుపొమ్మన్నట్టు ఏపీలో లోకల్ వార్ అంతకంతకూ లేటవుతోంది. వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసినా, బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాల చిక్కులపై కోర్టుల్లో కేసులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. తీర్పులొచ్చి, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై క్లారిటీ వస్తే తప్ప స్థానికసంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అందుకే, గాల్లోకి చూస్తూ నిలబడిపోయింది స్టేట్ ఈసీ. కేంద్రం నుంచి రావల్సిన వేల కోట్ల పంచాయితీ అభివృద్ధి నిధులు ఆగిపోతాయి కనుక, డిసెంబర్లోగా స్థానిక సమరం పూర్తి చేసేతీరాలని కూటమి పట్టుదలతో ఉంది. అడ్డుకుంటున్నది మేం కాదు, కోర్టులు అని తమదైన వాదన వినిపిస్తోంది వైసీపీ. అలాగని, షెడ్యూల్ వచ్చేదాకా ఖాళీగా కూర్చుంటామా ఏంటి అని ఇష్యూ బేస్‌డ్‌గా కొట్లాటకు దిగేసి, పొట్టుపొట్టు తిట్టుకుంటున్నాయి పార్టీలు. విపక్షం మాటలతో తూటాలు పేలుస్తుంటే, అధికారపక్షం చేతలతోనే చేవ చూపిస్తోంది. లోకల్ ఓటు మీద ముందే కర్చీఫేసుకుంది. కేవలం అభివృద్ధి చేస్తేనే పండగైపోదు, పబ్లిక్‌ని అందులో ఇన్‌వాల్వ్ చేసినప్పుడే పొలిటికల్ ఎడ్వాంటేజ్ దక్కుతుంది.123 మున్సిపాలిటీల్లో 11 వేల 400 కోట్ల పనులకు కుప్పంలో ఒకేసారి వర్చువల్‌గా శంకుస్థాపన చేసినప్పుడు సీఎం చంద్రబాబు చెప్పిన నిఖార్సయిన మాట ఇది. ఇప్పటికే 22 వేల కోట్ల పనులను ప్రారంభించి, ఆరునెలల్లో మిగితా నిధులిచ్చి… పట్టణాల్లో మౌలిక...
