AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే స్టేషన్‌లో నీళ్లు సురక్షితమేనా? బ్యాక్టీరియా పరీక్షల్లో వెలుగుచూసిన ఆసక్తికర నిజాలు

రైలు ప్రయాణంలో దాహం వేస్తే.. స్టేషన్లలోని కుళాయి నీళ్లు తాగడానికి చాలామంది జంకుతుంటారు. అందులో బ్యాక్టీరియా ఉంటుందేమో, కలుషితమైందేమో అన్న భయమే ఇందుకు కారణం. కానీ, ప్రయాణికుల భయాలను పటాపంచలు చేస్తూ విజయవాడ రైల్వే డివిజన్‌ నిర్వహించిన నీటి పరీక్షల్లో ఆసక్తికర నిజాలు వెలుగుచూశాయి.

రైల్వే స్టేషన్‌లో నీళ్లు సురక్షితమేనా? బ్యాక్టీరియా పరీక్షల్లో వెలుగుచూసిన ఆసక్తికర నిజాలు
Railway Water Quality
M Sivakumar
| Edited By: |

Updated on: Sep 28, 2026 | 9:42 PM

Share

నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల దాహం తీర్చే నీటి నాణ్యతపై విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డివిజన్ పరిధిలోని స్టేషన్లు, రైల్వే ప్రాంగణాల్లో విస్తృతంగా నిర్వహించిన నీటి పరీక్షల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. విజయవాడ డివిజన్‌ పరిధిలోని 99 రైల్వే స్టేషన్లలో 633 నీటి శాంపిల్స్‌ను బ్యాక్టీరియా కోసం పరీక్షించగా.. ఇందులో ఒక్క శాంపిల్‌ కూడా బ్యాక్టీరియా కారణంగా అనర్హంగా తేలలేదు. ప్రయాణికులకు అందించే నీరు సురక్షితంగా ఉన్నట్లు స్పష్టమైంది. కేవలం బ్యాక్టీరియా పరీక్షలతోనే రైల్వే అధికారులు ఆగిపోలేదు. నీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగించే క్లోరిన్‌ స్థాయి ఎలా ఉందన్న దానిపైనా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు.

83 రైల్వే స్టేషన్లలో ఏకంగా 9,571 సార్లు క్లోరిన్‌ స్థాయిని పరీక్షించారు. ఇందులో 9,565 పరీక్షల్లో నీరు నిర్దేశించిన ప్రమాణాల మేరకే ఉన్నట్లు తేలింది. కేవలం ఆరు చోట్ల మాత్రమే క్లోరిన్‌ స్థాయికి సంబంధించి సమస్యలు గుర్తించారు. ఎక్కడైనా సమస్య కనిపిస్తే వెంటనే గుర్తించి పరిష్కరించేలా నిఘా పెట్టిన అధికారులు.. ఆ ఆరు చోట్ల కూడా పరిస్థితిని సరిచేసేందుకు సంబంధిత విభాగాల ద్వారా తక్షణ చర్యలు చేపట్టారు.

విజయవాడ స్టేషన్‌లో ప్రత్యేక నిఘా

నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్‌లో నీటి నాణ్యతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడ 127 బ్యాక్టీరియా పరీక్షలు, 1,249 క్లోరిన్‌ పరీక్షలు చేశారు. వీటిలోనూ నీరు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. భీమవరం సెక్షన్‌లోని తొమ్మిది స్టేషన్లలో 105 బ్యాక్టీరియా పరీక్షలు, 1,020 క్లోరిన్‌ పరీక్షలు నిర్వహించారు. ఇక తెనాలి డిపోలో ఏకంగా 1,204 క్లోరిన్‌ పరీక్షలు చేశారు. డివిజన్‌లో ఒకే డిపోలో నిర్వహించిన క్లోరిన్‌ పరీక్షల్లో ఇదే అత్యధిక సంఖ్య కావడం గమనార్హం.

మొత్తంగా చూస్తే.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఉపయోగించే నీటి నాణ్యతపై అధికారులు తీసుకుంటున్న చర్యలకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి. 633 బ్యాక్టీరియా శాంపిల్స్‌లో ఒక్కటీ అనర్హంగా తేలకపోవడం, క్లోరిన్‌ పరీక్షల్లో 99.93 శాతం ఫలితాలు ప్రమాణాల మేరకు ఉండటం ప్రయాణికులకు ఊరటనిచ్చే అంశం. అరుదుగా గుర్తించిన సమస్యలను కూడా వెంటనే సరిచేస్తూ.. నీటి నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
రైల్వే స్టేషన్‌లో నీళ్లు సురక్షితమేనా? బ్యాక్టీరియా పరీక్షల్లో ..
రైల్వే స్టేషన్‌లో నీళ్లు సురక్షితమేనా? బ్యాక్టీరియా పరీక్షల్లో ..
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన హీరో చనిపోయాడని తెలుసా?
'విక్రమార్కుడు'లో రవితేజ డూప్‌గా చేసిన హీరో చనిపోయాడని తెలుసా?
పుదీనా మొక్కను ఇలా నాటితే గుబురుగా పెరగడం పక్కా..
పుదీనా మొక్కను ఇలా నాటితే గుబురుగా పెరగడం పక్కా..
భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?
భోజనం చేసిన వెంటనే వేడి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది?
యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఈ విషయం మర్చిపోతే కోర్టు కేసులే..
యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు ఈ విషయం మర్చిపోతే కోర్టు కేసులే..
సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
సొంత తమ్ముడినే అతి కిరాతకంగా హత్య చేయించిన అన్న.. ఎందుకంటే?
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
గ్రాండ్ గా వస్తున్న కార్తిక్ జయంతి రాయవలస..
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
రుచికరమైన పట్టా గోబీ లచ్చాపరాఠా ఎప్పుడైనా తిన్నారా? భలే ఉంటుందిలే
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
నాని ' ది ప్యారడైజ్' సినిమాలో ఆ స్టార్ నటుడి సీన్లు కట్ చేశారా?
భారత్, చైనాలో మనీప్లాంట్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
భారత్, చైనాలో మనీప్లాంట్ కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?