హాయ్..నేను మీ జర్నలిస్ట్ శివకుమార్ ( అలియాస్ ) బాబీ . తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో 8ఏళ్ల అనుభవం ఉంది.. 2016లో టీవీ9 తెలుగు మీడియా రంగంలో తొలుత కంట్రిబ్యూటర్ గా జర్నీ ప్రారంభించాను.. 2018లో స్టాఫ్ రిపోర్టర్ గా బాధ్యతలు స్వీకరించాను.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై కధనాలు అందిచాను . రాష్టంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటనలు , ఈవెంట్లు , రాజకీయ కార్యక్రమాలు , ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఆరేళ్లుగా విజయవాడ నుంచి సీనియర్ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను..
Air Quality: ఢిల్లీ బాటలో ఏపీలోని ఆ నగరం.. ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. ఎంతుందంటే?
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఏ స్థాయికి చేరిందే అందరికీ తెలుసు.. ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితే మన తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపింస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్, ఏపీలోని విజయవాడలో కూడా గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతుంది. నగరాల్లో ఎక్కడ చూసిన ఎత్తైన భవనాలు తప్ప.. పచ్చదనం కనిపించట్లేదు.. దీంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విజయవాడలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎలా ఉందో చూద్దాం పదండి.
- M Sivakumar
- Updated on: Dec 1, 2025
- 11:46 am
Andhra: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనం.. దానిపై రాసున్నది ఆరా తీయగా
రోమియో.. జూలియట్.. షాజహాన్.. ముంతాజ్ వంటి ప్రేమ కథలు ప్రజల్లో తరతరాలుగా వినిపిస్తున్నాయి. అయితే మచిలీపట్నం నేలపై 17 శతాబ్దంలో జరిగిన ఒక డచ్ ప్రేమ కథ మాత్రం చరిత్ర పుటల్లో దాగి ఉంది. దాదాపు 347 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటన మళ్లీ చర్చనీయాంశమైంది.
- M Sivakumar
- Updated on: Nov 29, 2025
- 2:01 pm
Andhra News: వీటితో జాగ్రత్త.. దోమలవే కాదు.. మీ ప్రాణాలు కూడా పోవచ్చు..! ఎందుకంటే?
ఇంట్లో దోమల బెడద ఎక్కువైందని.. చాలా మంది వాటిని తరిమికొట్టేందుకు, జెట్ లేదా ఆలౌట్ వంటికి వాడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా.. దోమలు బత్తులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వీటిని వాడుతున్నారు. మీరు కూడా అలాంటి దోమల బత్తులను వాడుతున్నారా?.. అయితే మీరు కచ్చితంగా ఈ వార్త తెలుసుకోవాల్సిందే.
- M Sivakumar
- Updated on: Nov 28, 2025
- 5:36 pm
Andhra News: 3 రాష్ట్రాలను వణికించారు.. కట్‌చేస్తే.. విజయవాడలో అడ్డంగా బుక్కయ్యారు..
దేశంలోనే పేరుగాంచిన అతిపెద్ద బస్టాండ్లలో పండిట్ నెహ్రూ బస్టాండ్ ఒకటి.. ఇది ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అయితే ఓ గ్యాంగ్ విజయవాడ బస్టాండ్ ను టార్గెట్ చేసి... ప్రయాణికుల వద్ద దొంగతనాలకు పాల్పడుతుంది.. పోలీసులకు సమాచారం రావడంతో.. ఆ అంతర్రాష్ట్ర గ్యాంగ్ ను గుట్టురట్టు చేశారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన కుప్రసిద్ధ పర్తి గ్యాంగ్ అని గుర్తించిన పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు.
- M Sivakumar
- Updated on: Nov 28, 2025
- 12:40 pm
Gannavaram Airport : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. శంషాబాద్‌ను తలదన్నేలా.. గన్నవరం ఎయిర్పోర్ట్!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టులో నూతన నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు తుదిదశకు చేరాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దీని నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.ఈ నిర్మాణం పూర్తయితే దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులలో ఒకటిగా ఈ గన్నవర్ విమానశ్రయం అవతరించనుంది.
- M Sivakumar
- Updated on: Nov 27, 2025
- 1:51 pm
Viral Video: అవి పాములు కాదంట.. శ్రీ రామపాదక్షేత్రంలో కనిపించినవి ఏంటో తెలుసా..?
కృష్ణానది తీరంలోని నాగాయలంక గ్రామంలోని శ్రీ రామపాదక్షేత్రం పుష్కర ఘాటు వద్ద అరుదైన ప్రకృతిదృశ్యం ప్రత్యక్షమైంది.. రాత్రివేళల్లో నది నీటిపొరమీద పాము ఆకారాన్ని తలపించే ఈల్ చేపలు గుంపులు గుంపులుగా ఈదుతూ కనిపించడంతో భక్తులు, పర్యాటకులు ఆశ్చర్యంతో తిలకిస్తున్నారు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..
- M Sivakumar
- Updated on: Nov 23, 2025
- 12:33 pm
5 రూపాయలతో క్యూలో నిలబడి అల్పాహారం చేసిన జిల్లా కలెక్టర్..
అల్పాహారం కోసం వచ్చిన ప్రజలతో ఆప్యాయంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడారు..ఆహారం నాణ్యత , రుచి , వేడి , అందుబాటులాంటివి వివరంగా తెలుసుకున్నారు.. క్యాంటీన్ లోని ఆహార పదార్థాలు పట్టిక టోకెన్ కౌంటర్ , డైనింగ్ ఏరియా తాగునీటి నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు..
- M Sivakumar
- Updated on: Nov 20, 2025
- 9:29 pm
Watch Video: అయ్య బాబోయ్.. ఇదేమి వింత.. శివాలయం వెనుక వందలాది సర్పాలు..!
కృష్ణాజిల్లా నాగాయలంకలోని శ్రీ రామపాద క్షేత్రం వద్ద అద్భుతం చోటుచేసుకుంది. ఆలయం వెనక ప్రవహిస్తున్న కృష్ణా నదిలో పాములు ప్రత్యక్షం కావడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. నది తీరాన్ని దర్శించడానికి వచ్చినవారు ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్దులయ్యారు. ఈ అద్బుత దృశ్యాను కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- M Sivakumar
- Updated on: Nov 19, 2025
- 6:50 pm
ఆ నగరంలో ఇల్లు అద్దెకు ఇవ్వాలంటేనే వణికిపోతున్న ఓనర్స్.. ఎందుకో తెలుసా?
ఎప్పుడు రద్దీగా ఉండే విజయవాడ నగరం ఒక్కసారిగా సీన్ మారిపోయింది.. నగరంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు పెరిగాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో నగరం మొత్తం ఉలిక్కపడింది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. విజయవాడ సరిహద్దుల్లోని కానూరులో అనుమానస్పద కదలికలు గుర్తించారు.. దీంతో బెజవాడలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.
- M Sivakumar
- Updated on: Nov 19, 2025
- 5:44 pm
Watch: నది మధ్యలో సడెన్‌గా ఆగిపోయిన పడవ.. తర్వాత ఏం జరిగిందంటే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
కృష్ణా నదిలో తృటిలో పడవ ప్రమాదం తప్పింది.. వేదాద్రి నుంచి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు ప్రయాణిస్తున్న పడవలో ఒక్కసారిగా సాంకేతిక లోపం సంభవించింది.. ఇంజన్ బ్యాటరీ పనిచేయకపోవడంతో పడవ మార్గ మధ్యలో నిలిచిపోయింది.. మరోవైపు నదీ ప్రవాహం ఉండడంతో పడవ కొంత దూరం కొట్టుకుపోయింది. దీన్ని గమనించిన అక్కడి స్థానికులు పడవలో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
- M Sivakumar
- Updated on: Nov 14, 2025
- 4:15 pm
Amaravati: అమరావతి సచివాలయం వద్ద ఉన్న రైతును కల తప్పినా పట్టించుకోరే…
అమరావతి సచివాలయం ప్రాంగణంలోని ఎద్దుల బండి చిహ్నం రైతుల గౌరవాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేక గుర్తుగా నిలిచింది. 2015లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సచివాలయంలో ఈ ఎద్దుల బండి, రైతుల సంపద, శ్రమను ప్రదర్శించే సాంస్కృతిక చిహ్నంగా ఆకర్షణీయంగా నిలిచింది. అయితే వర్షం, ఎండలతో అది ఇప్పుడు కల తప్పింది.
- M Sivakumar
- Updated on: Nov 19, 2025
- 6:03 pm
Sarpa Mitra: మీ నివాసాల్లోకి పాములొచ్చాయా? డోంట్ వర్రీ.. ఈ ఒక్క కాల్‌తో సమస్యకు చెక్..
మానవులు, వన్యప్రాణుల సమన్వయానికి, ఇరువురి మధ్య ఘర్షణలు తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది.. ఇందులో భాగంగానే గ్రామనికో సర్పమిత్ర అనే సరికోత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి గ్రామంలో వాలంటీర్లను ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ప్రజలకు వన్యప్రాణులకు మధ్య ఘర్షణలను తగ్గించేందుకు సహాయపడనున్నారు. ఈ నెలాఖరు నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.
- M Sivakumar
- Updated on: Nov 10, 2025
- 2:48 pm