AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బంగారం రేంజ్‌కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మామిడి సీజన్ ఇంకా గుమ్మం తట్టకముందే.. మార్కెట్లో మాత్రం రికార్డు స్థాయిలో రేట్లు హడావిడి మొదలైంది. తోటల్లో కోతలు పూర్తిగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కవర్లు కట్టిన బంగినపల్లి, తోతాపూరి రకానికి ఈసారి గోల్డ్ రేంజ్ ధరలు పలుకుతున్నాయి. ఒక టన్ను ధర వింటేనే ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి. చిన్న కవర్ కట్టిన కాయ పెద్ద లాభం తెచ్చిపెట్టుండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెళ్లి విరుస్తోంది.

Andhra Pradesh: బంగారం రేంజ్‌కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Banganapalli And Totapuri Mangoes Prices Soar
M Sivakumar
| Edited By: |

Updated on: Feb 25, 2026 | 6:43 PM

Share

మామిడి సీజన్ మొదలవకముందే మార్కెట్లో రేట్లు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా బంగినపల్లి రకం టన్నుకు ఒకటి. రూ.1.8 లక్షలు వరకు పలుకుతూ ఉండటంతో రైతులకు ఉత్సాహాన్నిస్తోంది. ఇదే సమయంలో కవర్లు లేకుండా పండించిన మామిడికి తన్నుకు వేల కంటే ఎక్కువ రావడంతో స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. కవర్లు కట్టిన తోతాపూరి రకం కూడా టన్నుకు లక్ష రూపాయలు పైగానే అమ్ముడు అవుతుంది. పురుగు , పక్షుల దాడి, రసాయన అవశేషాలు వంటి సమస్యలు రాకుండా పండ్లకు ప్రత్యేక కవర్లు తొడగటం ఇప్పుడు రైతుల్లో ట్రెండ్‌గా మారింది. దీంతో పండ్లు నాణ్యతగా ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుంది. కవర్ ఒకటి సుమారు రెండు రూపాయలు మాత్రమే ఉండగా కూలీకి ఆదనంగా రూపాయి ఖర్చు అవుతుంది. ఉద్యాన శాఖ 50శాతం రాయితీ ఇస్తూ ఉండటంతో రైతులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు.

ఏపీలో సుమారు పది లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. అందులో ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపు 57 వేల ఎకరాల్లో బంగినపల్లి, తోతా పూరి, రసాలు సువర్ణ రేఖ రకాల సాగు ఉంది. విజయవాడ రూరల్ విస్సన్నపేట, ఏ కొండూరు జి కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం తిరువూరు, నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో విస్తృతంగా తోటలు ఉన్నాయి. ఈ జిల్లాలలో ఏట సుమారు 2.30 లక్షల టన్నుల మామిడి దిగుమతి వస్తుంది. ముఖ్యంగా రెడ్డిగూడెం మండలంలో ముందస్తు పోతా, కోత ప్రత్యేకంగా ఉంది. గత 20 రోజులుగా రైతులు కోతలు ప్రారంభించారు. నాణ్యమైన పెద్ద సైజు పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. పచ్చల తయారీ కోసం ఉత్తరాది వ్యాపారులు కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు.

సాధారణంగా తొలి కోత తర్వాత ధరలు కాస్త తగ్గటం సహజం. అయితే ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నాణ్యతతో కూడిన ఉత్పత్తి డిమాండ్ పెరుగుదల కారణంగా ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తోటపూరి ధరలు పతనమై రైతులు నష్టపోయారు. అప్పట్లో కిలో 12 రూపాయలు ధర వచ్చేలా ప్రభుత్వం నాలుగు రూపాయల సబ్సిడీ భరించింది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. ఎన్టీఆర్ జిల్లాలో తోతాపూరి టన్నుకు లక్ష రూపాయలు పైగా అమ్ముడవడం విశేషం.. ఇక జగ్గయ్యపేట ప్రాంతాల్లో కొన్ని చోట్ల తెగుళ్లు విగ్రమించడంతో పూత నిలవక దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కవర్ల వినియోగం వల్ల నాణ్యత ధర రెట్టింపులను స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయి ధరలు రావడం మామిడి రైతులకు నిజంగా మధుర ఫలంగా మారింది.

Follow Us
బంగారం రేంజ్‌కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
బంగారం రేంజ్‌కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
రైతుల కోసం కేంద్రం మరో కొత్త నిర్ణయం.. అందరికీ బెనిఫిట్
రైతుల కోసం కేంద్రం మరో కొత్త నిర్ణయం.. అందరికీ బెనిఫిట్
భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు..స్వామివారి పట్టు వస్త్రాలు మాయం
భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు..స్వామివారి పట్టు వస్త్రాలు మాయం
శుక్రుడితో వారికి లక్ష్మీ కటాక్షం.. వారి లైఫ్ స్టైల్ మారిపోవడం..
శుక్రుడితో వారికి లక్ష్మీ కటాక్షం.. వారి లైఫ్ స్టైల్ మారిపోవడం..
అరె ఏంట్రా ఇది! ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్.. అమ్మాయి ఎవరంటే?
అరె ఏంట్రా ఇది! ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్.. అమ్మాయి ఎవరంటే?
త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్
త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్
పెదవుల మార్పు గుండె ఆరోగ్యానికి సంకేతం కావచ్చు! జాగ్రత్త..
పెదవుల మార్పు గుండె ఆరోగ్యానికి సంకేతం కావచ్చు! జాగ్రత్త..
నేషనల్ లెవల్‌లో సౌత్ సినిమాల జోరు
నేషనల్ లెవల్‌లో సౌత్ సినిమాల జోరు
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా
స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్
స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్