AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్దం.. ఓ దువ్వెన.. సీఎం సాబ్ స్టైలే మారిపోయింది..! ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి చంద్రబాబు

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జేబులోని దువ్వెన ఆసక్తికరంగా మారింది. వాష్‌రూమ్‌లో అద్దం కనిపించడంతో జేబులో నుంచి దువ్వెన తీసి తల దువ్వుకున్న చంద్రబాబు.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో జేబులో దువ్వెన పెట్టుకుని తిరగడం సాధారణమని, అద్దం కనిపించినప్పుడల్లా జుట్టును సరిచేసుకునేవాళ్లమని చెప్పడంతో ఈ దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది.

అద్దం.. ఓ దువ్వెన.. సీఎం సాబ్ స్టైలే మారిపోయింది..! ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి చంద్రబాబు
Ap Cm Chandrababu
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Aug 13, 2026 | 5:10 PM

Share

ముఖ్యమంత్రి అంటే.. ఫైళ్లు, సమీక్షలు, అధికారిక కార్యక్రమాలు.. ఇవే గుర్తొస్తాయి. కానీ.. ఏపీ సీఎం చంద్రబాబు జేబులో మాత్రం మరో వస్తువు కూడా ఉంటుంది. అదే దువ్వెన..! అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జేబులోని ఈ దువ్వెన బయటకు వచ్చింది. అద్దం కనిపించగానే జేబులో నుంచి దువ్వెన తీసి తల దువ్వుకున్న చంద్రబాబు.. ఆ వెంటనే దాని వెనుక ఉన్న తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.. ప్రస్తుతం.. ఏపీ సీఎం చంద్రబాబు దువ్వెనతో దువ్వుకుంటున్న ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

క్వార్టర్ల పరిశీలనలో.. దువ్వెన ఎపిసోడ్..

అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను ప్రారంభించిన చంద్రబాబు.. అక్కడి వసతులను స్వయంగా పరిశీలించారు. గదుల్లో గాలి, వెలుతురు సరిగా వస్తున్నాయా..? నివాసానికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా..? అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలా ఒక్కో గదిని పరిశీలిస్తూ వెళ్లిన సీఎం.. వాష్‌రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ అద్దం కనిపించింది. అంతే.. జేబులో ఉన్న దువ్వెన బయటకు తీశారు.

అద్దం కనిపించింది.. దువ్వెన బయటకొచ్చింది

అద్దం ముందు నిలబడి చంద్రబాబు కాసేపు తల దువ్వుకున్నారు. సాధారణంగా కనిపించే ఈ చిన్న సన్నివేశం అక్కడున్నవారి దృష్టిని ఆకర్షించింది. అయితే.. దువ్వెన ఎందుకు జేబులో పెట్టుకుంటారనే దానికి కూడా సీఎం దగ్గర ఓ పాత కథ ఉంది.

‘‘మా కాలంలో జేబులో దువ్వెన కచ్చితంగా ఉండేది’’.. అంటూ తన పాతకాలం నాటి రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో దువ్వెన జేబులో పెట్టుకోవడం సాధారణమేనంటూ చెప్పుకొచ్చారు. అద్దం ఎక్కడ కనిపించినా.. వెంటనే దువ్వెన తీసి జుట్టును సరిచేసుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో ఎక్కువగా క్రాప్ హెయిర్‌స్టైలే ఉండేదని చంద్రబాబు చెప్పారు. పాపటి నీట్‌గా రావాలంటే దువ్వెన తప్పనిసరిగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. అందుకే దువ్వెన జేబులో పెట్టుకుని తిరిగేవాళ్లమన్నారు.

ఇప్పుడంతా పైకి దువ్వేయడమే..!

అప్పటితో పోలిస్తే ఇప్పుడు హెయిర్‌స్టైల్‌ కూడా మారిపోయిందన్నారు చంద్రబాబు. ఇప్పుడంతా జుట్టును పైకి దువ్వేయడమో.. లేదంటే అలాగే వదిలేయడమో చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఒక అద్దం.. ఓ దువ్వెన.. అంతే..! కాసేపట్లోనే చంద్రబాబు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us