తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో 22 ఏళ్ల అనుభవం ఉంది. అప్పటి సంచలన దిన పత్రిక వార్త లో క్రైమ్ రిపోర్టర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి ఈనాడు జర్నలిజం స్కూల్ లో 2006-2007 బ్యాచ్ విద్యార్థిగా శిక్షణ పూర్తయింది. 2008 – 2009 లో మా టీవీ స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా, 2009 – 2014 వరకు టీవీ9 లో కరెస్పాండెంట్ గా, బ్యూరో చీఫ్ గా హైదరాబాద్, విశాఖ, విజయవాడ, ఢిల్లీ లో పనిచేసిన అనుభవం. 2014 – 19 వరకు డెక్కన్ క్రానికల్ లో స్పెషల్ కరస్పాండెంట్ గా ముఖ్యమంత్రి కార్యాలయ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన అనుభవం. 2019 లో హెచ్. ఎం. టీ. వీ. స్టేట్ బ్యూరో చీఫ్ గా స్వల్పకాలం పనిచేసిన అనంతరం 2021 మార్చ్ నుంచి టీవీ9 – ఉత్తరాంధ్ర బ్యూరో చీఫ్ గా పనిచేస్తూ ఉన్నాను.
Pahalgam Terror Attack: విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి, కుటుంబంలో విషాదం
కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం పాండురంగపురం కు చెందిన మూడు కుటుంబాలపై పెహల్గాం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి (70) కుటుంబంతో పాటు మరో రెండు జంటలు కలిసి ఈ నెల 18న టూర్‌కు బయల్దేరారు. అయితే పర్యటన మధ్యలో ఏర్పడిన అనూహ్య పరిస్థితులు ఆ కుటుంబాలను విడదీసి, భయాందోళనలో ముంచెత్తాయి.
- Eswar Chennupalli
- Updated on: Apr 23, 2025
- 8:15 am
Amaravati NTR Statue: స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం.. ఎన్ని అడుగులంటే..
అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే మరో పని చేయాలని నిర్ణయించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ నాయకుడు, దిగ్గజ నటుడు స్వర్గియ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకంగా భారీ విగ్రహాన్ని నీరుకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనుంది.
- Eswar Chennupalli
- Updated on: Apr 22, 2025
- 5:01 pm
Andhra Pradesh: 10వ తరగతి విద్యార్థులకు అలెర్ట్.. రిజల్ట్స్ డేట్ వచ్చేసింది
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరింతా రిజల్ట్ కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తాజాగా పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..
- Eswar Chennupalli
- Updated on: Apr 21, 2025
- 7:21 pm
AP Mega DSC 2025 Notification: మరికాసేపట్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే
మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ మరికాసేపట్లో విడుదలకానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు..
- Eswar Chennupalli
- Updated on: Apr 20, 2025
- 6:20 am
CM Chandrababu: సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి జన్మదిన వజ్రోత్సవం.. ఏ దేశంలో తెలుసా..?
75 ఏళ్ల వయసు అంటే ఒక రాజకీయ నాయకుడి జీవితంలోనే కాక, ఏ వ్యక్తిగత జీవితానికైనా ఒక మైలురాయి. అంతటి ఘనత గల సందర్భాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో కాదు, విదేశాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా జరుపుకోవాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున నాయకులు, శ్రేణులు, అభిమానులు, రాజకీయ ప్రదర్శనలు జరగకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని ఆయన భావించినట్టు తెలిసింది.
- Eswar Chennupalli
- Updated on: Apr 15, 2025
- 9:00 pm
Andhra Pradesh: 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
- Eswar Chennupalli
- Updated on: Apr 15, 2025
- 4:56 pm
మే 2న అమరావతికి ప్రధాని మోదీ.. రాజధాని పునః నిర్మాణ పనులకు శ్రీకారం..
తెలుగు ప్రజలందరూ ఎప్పటినుంచో ఉత్కంఠగా ఎదురు చూసే సమయం రానే వచ్చింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విచ్చేయనున్నారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలవనుంది. ఎందుకంటే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
- Eswar Chennupalli
- Updated on: Apr 15, 2025
- 4:35 pm
Amaravati 2.0: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరో 44 వేల ఎకరాల భూ సేకరణకు సన్నద్ధం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటోంది. అమరావతిని ఒక సమగ్ర, ప్రగతిశీల రాజధానిగా తీర్చిదిద్దే క్రమంలో చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధానిలో పెరుగుతున్న అవసరాలు, కీలక పౌర సదుపాయాలకు స్థలాభావం కారణంగా మరో 44,676 ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
- Eswar Chennupalli
- Updated on: Apr 14, 2025
- 9:15 am
Andhra News: ఏపీ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు.. లింక్ ఇదిగో
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలెర్ట్. రేపు అనగా శనివారం ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరి ఇంటర్ ఫలితాలను ఎలా చూడొచ్చు.? ఏ టైంకు విడుదల అవుతాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Eswar Chennupalli
- Updated on: Apr 11, 2025
- 12:00 pm
Andhra: పేద్ద పండుగే.. ఇకపై మధ్యాహ్న భోజనంలో ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. మధ్యాహ్న భోజన పధకంలో కీలక మార్పులు చేసింది కూటమి సర్కార్. పైలెట్ ప్రాజెక్టు కింద మొదట 'ఎగ్ ఫ్రైడ్ రైస్'ను ప్రవేశపెట్టనుంది. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.!
- Eswar Chennupalli
- Updated on: Apr 11, 2025
- 12:02 pm
Andhra: జగన్ కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అనుచితమైన, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే యువకుడిని మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.
- Eswar Chennupalli
- Updated on: Apr 10, 2025
- 5:59 pm
Andhra News: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల అప్పుడే.. డేట్ ఎప్పుడంటే.?
ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు అంటే విద్యార్థులకు ఒక పెద్ద మైలురాయి. జీవితంలో ఉన్నత విద్యకు ద్వారం అయ్యే ఈ పరీక్షలు విద్యార్థులపై మానసికంగా ఎంతటి ఒత్తిడి పెడతాయో తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును..
- Eswar Chennupalli
- Updated on: Apr 9, 2025
- 7:54 pm