Multibagger: సమయం లేదు మిత్రమా..! ఏడాదిలోనే 220% లాభం.. ఇప్పుడు 1 షేర్ కు 4 షేర్లు ఉచితం..
Multibagger: బోనస్ షేర్ల ప్రయోజనాలను పొందడానికి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. రికార్డ్ తేదీకి ముందు ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన వారు మాత్రమే బోనస్ షేర్లను పొందడానికి అర్హులు. మీరు 1 షేరు కొనుగోలు చేస్తే మీ..

Multibagger: స్మాల్ క్యాప్ ఫైనాన్షియల్ కంపెనీ LKP ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు ఈ వారం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇటీవల సమావేశమై బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది. దీనికి మార్చి 6వ తేదీని రికార్డు తేదీగా ప్రకటించింది. అంటే బోనస్ షేర్ల ప్రయోజనాలను పొందడానికి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. రికార్డ్ తేదీకి ముందు ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన వారు మాత్రమే బోనస్ షేర్లను పొందడానికి అర్హులు. మీరు 1 షేరు కొనుగోలు చేస్తే మీకు 4 షేర్లు ఉచితంగా లభిస్తాయి.
అదేవిధంగా, మీరు 100 షేర్లను కొనుగోలు చేస్తే మీకు 400 షేర్లు ఉచితంగా లభిస్తాయి. అంటే మీకు మొత్తం 500 షేర్లు లభిస్తాయి. మరోవైపు ఈ కంపెనీ స్టాక్ గత ఒక సంవత్సరంలో 220% లాభపడి మల్టీబ్యాగర్ స్టాక్‌గా మారింది.
స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు దాఖలు చేసిన సమాచారం ప్రకారం.. ఇటీవల సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు 4:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది. అంటే రికార్డు తేదీన తమ డీమ్యాట్ ఖాతాలో రూ.10 ముఖ విలువ గల 1 ఈక్విటీ షేరును కలిగి ఉన్నవారికి రూ.10 ముఖ విలువ గల 4 ఈక్విటీ షేర్లను బోనస్‌గా ఉచితంగా ఇస్తారు. ఈ బోనస్ షేర్ల జారీకి డైరెక్టర్ల బోర్డు మార్చి 6, 2026ని రికార్డు తేదీగా నిర్ణయించిందని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Bank Deposit: ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే రూ.41,478 రూపాయల వడ్డీ!
గత శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో LKP ఫైనాన్స్ షేర్లు రూ.988 వద్ద 0.88% లాభంతో ముగిశాయి. ఈ షేర్ల 52 వారాల గరిష్ట స్థాయి రూ.1179.80 కాగా, దాని 52 వారాల కనిష్ట స్థాయి రూ.294.71. గత వారంలో షేర్లు దాదాపు 1% పెరిగాయి. గత ఒక నెలలో ఇది 2% పెరిగింది. గత ఆరు నెలల్లో ఇది దాదాపు 77% పెరిగింది. గత ఒక సంవత్సరంలో ఇది 220% పెరిగింది. అంటే ఒక సంవత్సరం క్రితం ఈ స్టాక్‌లో 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి మొత్తం 3.20 లక్షలు వచ్చాయి. గత మూడు సంవత్సరాలలో ఇది 913% లాభం ఇచ్చింది. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 1520 కోట్లు.
(నిరాకరణ: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ప్రమాదకరం. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. దేనిలోనైనా పెట్టుబడి పెట్టేముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.)
Best Selling Cars: భారతదేశంలో అత్యధికంగా అమ్మడైన కారు ఏదో తెలుసా..? బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితా విడుదల
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




