కాకినాడ మూడవ డివిజన్ గూడారి గుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు బైకులు బలంగా ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.