ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం.. భారీగా ఉద్యోగాలు!
విశాఖ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నంలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇమిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీనితో ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు విదేశీ ప్రయాణాలకు హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ కార్యాలయం విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి, అంతర్జాతీయ విమాన సేవలు, కార్గో కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుంది. పర్యాటకం, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెరిగి, విశాఖ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
