ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలు తాగాలా? వద్దా..?

01 March 2026

TV9 Telugu

TV9 Telugu

ఉదయాన్నే గ్లాసుడు గోరు వెచ్చని పాలు తాగితే హాయిగా ఉంటుంది. నీరసం వదలిపోయి ఒంట్లో తక్షణ శక్షి కూడా వస్తుంది. జీర్ణక్రియ మెరుగుప‌డుతుంది

TV9 Telugu

అందుకే చాలా మంది పేగుల‌ ఆరోగ్యం కోసం రోజులో ఏదో ఒక టైంలో గోరు వెచ్చని పాలు తాగుతుంటారు. పాల‌ల్లో క్యాల్షియం, ప్రోటీన్‌తో పాటు శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు దండిగా ఉంటాయి

TV9 Telugu

పాలు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ ఖాళీ క‌డుపుతో పాల‌ను తాగ‌డం మంచిదేనా.. అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఖాళీ క‌డుపున పాలు తాగ‌డం క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది

TV9 Telugu

అయితే మ‌రికొంద‌రికి ఖాళీ క‌డుపుతో పాలు తాగ‌డం వ‌ల్ల ఉబ్బరం, ఆమ్లత్వం క‌లుగుతుంది. అందుకే ఇలాంటి వారు ఉదయాన్నే పాల‌ను ఖాళీ క‌డుపున తీసుకోవాలా వ‌ద్దా అని సందేహిస్తుంటారు

TV9 Telugu

నిజానికి పాలు పోష‌క‌మైన‌వే అయిన‌ప్పటికీ ప్రతి ఒక్కరికీ మేలు చేయవు. ఖాళీ కడుపుతో తాగడం వల్ల కొంద‌రిలో ఇది ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ వంటి స‌మ‌స్యల‌ను క‌లిగించ‌వ‌చ్చు

TV9 Telugu

అందుకే సున్నిత‌మైన జీర్ణక్రియ ఉన్నవారు పాల‌ల్లో ఓట్స్ లేదా ఇత‌ర గింజ‌ల‌ను ఒక టేబుల్ స్పూన్ క‌లిపి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా క‌డుపులో అసౌక‌ర్యం త‌గ్గుతుంది

TV9 Telugu

పాల‌ల్లో ప్రోటీన్ కండ‌రాల పెరుగుద‌ల‌కు స‌హాయ‌ప‌డుతుంది. కానీ జీవ‌క్రియ‌కు పాలు ఉపయోగపడవని వైద్యులు చెబుతున్నారు. అందుకు స‌మ‌తుల్య ఆహారం తప్పక తీసుకోవాలి

TV9 Telugu

అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఉద‌యం పూట కాకుండా వ్యాయామ స‌మ‌యానికి ద‌గ్గర‌గా పాలు తాగాలి. చల్లనివి బదులుగా గోరువెచ్చని పాలు తాగడం వల్ల క‌డుపులో ఆమ్లత్వం నివరించవచ్చు. అలాగే కొవ్వు పాలకు బదులుగా తక్కువ కొవ్వు ఉన్న పాలు తాగడం మంచిది