రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా బొప్పాయి ముక్కలు గిన్నెడు తిన్నారంటే..?

01 March 2026

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యం పది కాలాలపాటు చల్లగా ఉండాలని ప్రస్తుత రోజుల్లో చాలా మంది పండ్లపై దృష్టి పెడుతున్నారు. దీంతో దోస, ఇడ్లీ వంటి వాటిని పక్కకు తోసేసి పండ్ల ముక్కల్నే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లాగించేస్తున్నారు

TV9 Telugu

ముఖ్యంగా పండ్లని ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ ఉదయం అల్పాహారంగా బొప్పాయిని తీసుకుంటే మరిన్ని ఉపయోగాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు

TV9 Telugu

బొప్పాయిలోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది ప్రొటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే బొప్పాయిని తినడం వల్ల రోజంతా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది

TV9 Telugu

బొప్పాయిలో పీచు పదార్థం, నీటి శాతం కూడా అధికమే. ఇది పేగుల కదలికలను మెరుగుపరిచి, మలబద్ధకం సమస్యను సహజంగానే తగ్గిస్తుంది

TV9 Telugu

బొప్పాయిని రోజు కొన్ని ముక్కలు తింటే గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు సహజంగా తగ్గుతాయి. అంతేకాకుండా బొప్పాయిలో కేలరీలు తక్కువ. దీంతో ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది

TV9 Telugu

కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికీ ఇది మంచి ఎంపిక. బొప్పాయిలో ఉండే విటమిన్‌ సి శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది

TV9 Telugu

బొప్పాయిలోని ఫైబర్‌, పొటాషియం రక్తపోటును నియంత్రించడంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోదించవచ్చు

TV9 Telugu

ఇందులోని యాంటి ఆక్సిడెంట్‌ లక్షణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అకాల వృద్ధాప్య ఛాయల్ని రాకుండా అడ్డుకుంటుంది. అందుకే ఉదయాన్నే గిన్నెడు బొప్పాయి ముక్కలతో మీ రోజును ప్రారంభించండి