AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: గతం కంటే మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జనవరి 18-24, 2026): మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ప్రస్తుతం ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు ఆర్థికంగా కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ప్రస్తుతం ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మిథున రాశి రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 18, 2026 | 8:27 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల వారమంతా అనేక విధాలుగా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఆర్థికంగా కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ప్రస్తుతం ఆర్థిక, ఉద్యోగ విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల వల్ల కొన్ని లాభాలు పొందుతారు.  ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో, గురువు ధన స్థానంలో సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా సాగిపోతుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. గృహ, వాహన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు చురుకుగా పురోగమిస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, రాహు, రాశ్యధిపతి బుధుడి సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసి లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.  ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్య మైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. కుటుంబంతో ఆలయాలను సందదర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.  పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.  ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశికి భాగ్య స్థానంలో శనీశ్వరుడి సంచారం, సప్తమ  స్థానంలో నాలుగు గ్రహాల స్థితి కారణంగా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగావృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతుంది.  ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.  పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో గురు సంచారం వల్ల వల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలేవీ ఉండకపోవచ్చు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను పెంచడంమంచిది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యాన్ని తలపెడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): పంచమ స్థానంలో నాలుగు గ్రహాల యుతి వల్ల ఆర్థిక పరిస్థితికి లోటుండదు. వ్యక్తిగత జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొన్ని ముఖ్య వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదం ఒకటి సమసిపోతుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవ కాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.  ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరిగే అవకాశముంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, రవి, శని, కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. పెండింగు పనులన్నీ నిరాటంకంగా పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.  బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.  వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఇతరుల వ్యవహారాల కంటే సొంత పనులు మీద శ్రద్ధ పెంచడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఏ రంగంలో ఉన్నా పురోగతి ఉంటుంది. బుధ, శుక్ర గ్రహాల అనుకూలత కారణంగా, ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ,  అందుకు తగ్గ ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యయ ప్రయాసలతో గానీ ఏ ముఖ్యమైన వ్యవహారమూ పూర్తి కాదు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో పని భారం బాగా తగ్గుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.  ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.  రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి శుభవార్తలు వింటారు.  ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కుజ, బుధ, శుక్ర, గురు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం మరింత అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సూచనలకు, సలహాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శుక్ర, బుధ, శని, కుజుల బలం బాగా అనుకూలంగా ఉంది. షష్ట గురువు ప్రభావం బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు.  ప్రభుత్వ మూలక ధన లాభం కూడా ఉంది.  మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.  చేపట్టిన పనులను కొద్ది శ్రమతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ధన, పంచమ స్థానాలు బలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. మీ నుంచి సహాయం పొందినవారు మీకు ఆశించిన స్థాయిలో అండగా నిలబడతారు. శనీశ్వరుడు ధన స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కొందరు మిత్రుల కారణంగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): లాభ స్థానంలో నాలుగు శుభ గ్రహాల కలయిక వల్ల ఏలిన్నాటి శని దోషం కూడా తగ్గిపోతుంది.  ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మరిన్ని సదవకా శాలు అంది వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా మారుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. ఇతరులకు మేలు చేసే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ వల్ల లాభపడతారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. జీవిత భాగ స్వామికి వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో హాయిగా సాగిపోతాయి.

12 / 12