AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు మృతి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు Donald Trump ఆదివారం సంచలన ప్రకటన చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలో ఇరాన్‌కు చెందిన 48 మంది కీలక నేతలు హతమైనట్లు ఆయన తెలిపారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు మృతి: ట్రంప్
Trump
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2026 | 10:06 PM

Share

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌కు చెందిన 48 మంది నేతలు హతమైనట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం Fox Newsకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

“పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. 47 సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్య ఇప్పుడు త్వరితగతిన ముందుకు సాగుతోంది. ఒక్క దాడిలోనే 48 మంది నేతలు తొలగిపోయారు. మేము సాధిస్తున్న విజయాన్ని ఎవరూ నమ్మలేరు,” అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.

ఇటీవలి కాలంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం లేదా ఇతర అంతర్జాతీయ వర్గాల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులపై, అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది.

హెర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు

హెర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హర్మూజ్ సమీపంలో మూడు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు జరిగినట్లు సమాచారం. జలసంధి మూసివేతతో సుమారు 150 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర 10 శాతం పెరిగి 80 డాలర్లకు చేరుకోగా, త్వరలోనే 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ హెచ్చరికలతో ఆయిల్, గ్యాస్ రవాణాను పలు షిప్పింగ్ కంపెనీలు తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రపంచ మార్కెట్లపై దీనికి ప్రభావం పడే అవకాశం ఉంది.

అరేబియా సముద్రంలో ఒమన్‌-ఇరాన్‌ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి హర్మూజ్‌. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో ఐదో వంతుకు సమానం. సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అవుతోంది. ఇక లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ రవాణాకు కూడా అత్యంత కీలకం. మూడింట ఒక వంతు ఎల్‌ఎన్‌జీ కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది.

భారత్‌పై తీవ్ర ప్రభావం…

మన దేశం దిగుమతి చేసుకొనే ఎల్‌ఎన్‌జీలో సగానికిపైగా ఈ మార్గం నుంచే రావాల్సి ఉంటుంది. హర్మూజ్‌ మీదుగానే రావాల్సి ఉంది. ఇక రోజువారీ 55లక్షల పీపాల చమురును భారత్‌ ఈ మార్గం నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది భారత చమురు అవసరాల్లో 40%శాతానికి సమానం. హర్మూజ్‌లో ఇబ్బందులతో ప్రపంచ చమురు మార్కెట్లపై భారీ ఎఫెక్ట్ పడుతోంది..

Follow Us