విదేశాల్లో ఆందోళన కలిగిస్తున్న భారతీయుల మరణాలు.. అత్యధికంగా ఈ దేశంలోనే..!
విదేశాల్లో భారతీయుల మరణాలపై ప్రభుత్వం కారణాల వారీగా కూడా వివరాలు వెల్లడించింది. కార్యాలయ ప్రమాదాల కారణంగా సౌదీ అరేబియాలో 182 మంది, యూఏఈలో 128 మంది భారతీయులు మృతి చెందగా, అమెరికా, కెనడా, సింగపూర్, మాల్దీవుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా గత మూడేళ్లలో విదేశాల్లో వివిధ కారణాలతో మరణించిన భారతీయుల సంఖ్య 39 వేలకుపైగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో సుమారు కోటి మంది భారత పౌరులు, భారత సంతతికి చెందిన వారు నివసిస్తున్న నేపథ్యంలో, 2023 నుంచి 2025 మధ్య కాలంలో అక్కడ 1,340 మంది భారతీయులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు పార్లమెంట్‌కు ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు.
గల్ఫ్ దేశాల్లో నమోదైన ఆత్మహత్యల్లో అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 511 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సౌదీ అరేబియాలో 354, కువైట్‌లో 162, ఒమన్‌లో 146, బహ్రెయిన్‌లో 101, ఖతార్‌లో 66 కేసులు నమోదయ్యాయి. ఇదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఆత్మహత్య చేసుకుని మరణించిన భారతీయుల సంఖ్య 1,900 దాటగా, అందులో 70 శాతానికి పైగా గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల్లోనే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మలేషియాలో 131, అమెరికాలో 62 కేసులు నమోదయ్యాయి.
విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమం కోసం ప్రవాసీ భారతీయ బీమా యోజన (PBBY) అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ECR) కేటగిరీ కార్మికులకు ఈ బీమా తప్పనిసరిగా వర్తిస్తుందని, ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.10 లక్షల వరకు బీమా రక్షణతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..