AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లల్లోనూ ఈ సమస్య ఉందా? ICMR సర్వేలో బయటపడ్డ ఆందోళనకర నిజాలు!

దేశంలో పిల్లలు, యువత ఆరోగ్యంపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపాలు భవిష్యత్‌ తరాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్‌ B12 లోపం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN) నిర్వహించిన తాజా జాతీయ సర్వే వెల్లడించింది.

మీ పిల్లల్లోనూ ఈ సమస్య ఉందా? ICMR సర్వేలో బయటపడ్డ ఆందోళనకర నిజాలు!
Vitamin B12 Deficiency
Balaraju Goud
|

Updated on: Nov 26, 2026 | 9:02 PM

Share

న్యూఢిల్లీ: దేశంలో పిల్లలు, యువత ఆరోగ్యంపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపాలు భవిష్యత్‌ తరాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్‌ B12 లోపం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN) నిర్వహించిన తాజా జాతీయ సర్వే వెల్లడించింది. దేశంలోని 10 నుంచి 19 ఏళ్ల వయసున్న బాలికల్లో 65.4 శాతం మందికి, బాలురలో 66.1 శాతం మందికి విటమిన్‌ B12 లోపం ఉన్నట్లు గుర్తించారు. అంటే సుమారు ప్రతి ముగ్గురు కౌమారదశ పిల్లల్లో ఇద్దరు ఈ సమస్యతో బాధపడుతున్నారన్నమాట.

2 లక్షల మందికి పైగా ప్రజలపై సర్వే

ICMR-NIN 2023 నుంచి 2025 మధ్య నిర్వహించిన ఈ సర్వేకు SAMPADA (Survey for Assessment of Markers of Population Health, Activity, Diet and Anthropometry) అని పేరు పెట్టారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 183 జిల్లాల పరిధిలో 81 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2 లక్షల మందికి పైగా ప్రజలను ఇందులో చేర్చారు. 1.7 లక్షలకు పైగా రక్త నమూనాలను పరీక్షించారు. అయితే విటమిన్‌ B12, ఐరన్‌, ఫోలేట్‌ వంటి పోషకాల స్థాయిలను జనాభాలో ఎంపిక చేసిన ప్రత్యేక నమూనాలో పరీక్షించారు. ఈ అధ్యయనం పిల్లల నుంచి వృద్ధుల వరకు వివిధ వయసుల వారి పోషకాహార పరిస్థితిని అంచనా వేసింది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ సమస్య

కౌమార బాలికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 66.5 శాతం మందికి, పట్టణ ప్రాంతాల్లో 61.7 శాతం మందికి B12 లోపం ఉన్నట్లు తేలింది. బాలుర విషయంలో పట్టణ ప్రాంతాల్లో 68.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 65.3 శాతం మంది ఈ లోపంతో ఉన్నారు. అంటే ఈ సమస్య ఒక్క గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి.

చిన్నపిల్లల్లోనూ తగ్గని విటమిన్‌ B12 లోపం

  1. ఈ సమస్య కేవలం టీనేజర్లకే పరిమితం కాలేదు. చిన్నపిల్లల్లోనూ ఆందోళనకరమైన గణాంకాలు నమోదయ్యాయి.
  2. 5 నుంచి 9 ఏళ్ల పిల్లల్లో 46.5 శాతం మందికి B12 లోపం.
  3. 12 నుంచి 59 నెలల వయసున్న చిన్నారుల్లో 37.3 శాతం మందికి లోపం.
  4. 20 నుంచి 59 ఏళ్ల మహిళల్లో 55.2 శాతం మందికి లోపం.
  5. అదే వయసున్న పురుషుల్లో 60.4 శాతం మందికి లోపం.
  6. 60 ఏళ్లు పైబడిన మహిళల్లో 41.2 శాతం, పురుషుల్లో 46.8 శాతం మందికి లోపం.
  7. గర్భిణుల్లో ఈ సమస్య మరింత ఆందోళనకరంగా ఉంది.
  8. 63.1 శాతం గర్భిణుల్లో, 51.8 శాతం పాలిచ్చే తల్లుల్లో విటమిన్‌ B12 స్థాయిలు తక్కువగా ఉన్నట్లు సర్వే గుర్తించింది.

అసలు విటమిన్‌ B12 ఎందుకు అవసరం?

విటమిన్‌ B12 శరీరంలో ఎర్ర రక్తకణాల తయారీ, నాడీ వ్యవస్థ పనితీరు, DNA నిర్మాణం వంటి కీలక ప్రక్రియలకు అవసరం. దీని లోపం వల్ల అలసట, నీరసం, రక్తహీనత, చేతులు కాళ్లలో తిమ్మిర్లు, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు తలెత్తవచ్చు. పిల్లల్లో దీర్ఘకాలిక లోపం ఎదుగుదల, నాడీ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

లోపాన్ని ఎలా అధిగమించాలి?

పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసం వంటి ఆహార పదార్థాల్లో విటమిన్‌ B12 లభిస్తుంది. శాకాహారులు B12 ఫోర్టిఫైడ్‌ ఆహార పదార్థాలను తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అవసరమైతే వైద్యుల సూచనతో సప్లిమెంట్లు వాడాలి. రక్త పరీక్షల ద్వారా B12 స్థాయిలను తెలుసుకోవచ్చు. లోపం ఉన్నట్లు తేలితే సొంతంగా మందులు వాడకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.

మొత్తంగా చూస్తే.. విటమిన్‌ B12 లోపం దేశంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు విస్తరించిన పోషకాహార సమస్యగా మారిందని SAMPADA సర్వే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా కౌమారదశ పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల పోషకాహారంపై కుటుంబాలు, ఆరోగ్య శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు..!
దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు..!
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
భగవద్గీతలోని నాలుగో అధ్యాయం చదివితే ఇన్ని పుణ్యఫలాలా? శాపవిమోచనం
భగవద్గీతలోని నాలుగో అధ్యాయం చదివితే ఇన్ని పుణ్యఫలాలా? శాపవిమోచనం
9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డులపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన !
9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నంది అవార్డులపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన !
ఆసక్తికరంగా అలియాస్ రుక్మిణి ట్రైలర్..
ఆసక్తికరంగా అలియాస్ రుక్మిణి ట్రైలర్..
చలికాలంలో ఈ పండ్లు తప్పక తినాల్సిందే.. ఎందుకో తెలుసా?
చలికాలంలో ఈ పండ్లు తప్పక తినాల్సిందే.. ఎందుకో తెలుసా?
కప్ప ఆకారంలో శివలింగం.. ఏపీలోని చిన్న కాశీ అద్భుత రహస్యాలు ఇవే..
కప్ప ఆకారంలో శివలింగం.. ఏపీలోని చిన్న కాశీ అద్భుత రహస్యాలు ఇవే..