AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూలై 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. ఆర్థికంగా భారీ ఊరట!

Horoscope Today (July 29, 2026): బుధవారంనాడు కొన్ని రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ విషయాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. మేష, వృషభ, మిథున రాశుల వారికి ఉద్యోగ పురోగతి, ఆదాయ వృద్ధి, వ్యక్తిగత సమస్యల పరిష్కారం వంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

జూలై 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు.. ఆర్థికంగా భారీ ఊరట!
Rashi Phalalu 29 July 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూలై 29, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అయి ఊరట చెందుతారు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలకు లోటుండదు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృ ప్తికరంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అయి ఊరట చెందుతారు. శత్రు వులు, ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధి స్తారు. ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. పెండింగ్ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్య లున్నా అధిగమిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవకార్యాలలో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగులకు పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. రావ లసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, సాఫీగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ముఖ్య మైన వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరు ద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వాహన ప్రమాద సూచనలున్నాయి. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార, విహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సిఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయా లేర్పడతాయి. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. ఆచితూచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి సంబం ధించి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే సూచనలున్నాయి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. తొందరపాటు వ్యవహారాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట )

ఉద్యోగంలో అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ప్రయాణాలు, ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధువులతో మాట పట్టింపులు తలెత్తే సూచ నలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరు గుతాయి. వృత్తి జీవితంలో యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దగ్గర బంధువుల వల్ల లేదా కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాస్తంత ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. పిల్లలకు నుంచి శుభవార్తలు అందుతాయి. ఇష్టమైన బంధుమిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఒక కీలక రుణ సమస్య నుంచి బయటపడతారు. ఇంటా బయటా కొన్ని ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ జీవితంలో మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలను అధికారులు పాటించి ప్రయోజనం పొందుతారు. ప్రయాణాల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్య నుంచి కాస్తంత ఉపశమనం లభి స్తుంది. ఒకటి రెండు ప్రధాన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసు కోవద్దు. బంధుమిత్రుల వల్ల లబ్ధి పొందుతారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థికంగా పైచేయిగానే ఉంటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలు, తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

Also Read: ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..?

Follow Us
ఇలాంటి లవ్‌స్టోరీల కోసం ఎంతో ఎదురుచూశా: హీరో నాగచైతన్య
ఇలాంటి లవ్‌స్టోరీల కోసం ఎంతో ఎదురుచూశా: హీరో నాగచైతన్య
జూలై 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 29 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు..
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
చిరంజీవి నా వెబ్ సిరీస్‌ను అభినందించడం చాలా హ్యాపీగా ఉంది
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కొరియన్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
సప్తమాతృకలు ఎవరు? శివపార్వతులు వారికి పూజార్హత ఎందుకు కల్పించారు?
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఆ చివర భోగాపురం.. ఈ చివర మామునూరు.. ఎక్కడినుంచి ఎక్కడికైనా టేకాఫ్
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
ఉదయాన్నే ఈ ప్రోటీన్ ఇడ్లీ తింటే బరువు తగ్గడం ఖాయం..
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
అమరావతి అంటే కేవలం 29 గ్రామాలు కాదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్య
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి
నీకు ఛాన్స్ ఇస్తే..నాకు ఏమిస్తావు? సంచలన విషయాలు చెప్పిన రోహిణి