సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
మెదక్ జిల్లా మాంబోజీపల్లి సంతలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. కూరగాయలు కొంటున్న ఓ మహిళ బ్యాగులోని ఎనిమిది తులాల బంగారాన్ని చాకచక్యంగా దోచుకెళ్లారు. బాధితురాలు శ్రావణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగలు, సంతల సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
బంగారం ధరలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, బంగారు ఆభరణాలను ధరించడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇంట్లో ఉంచినా, బయటకు వెళ్లినా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలోని మాంబోజీపల్లి వారంతపు సంతలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సామాన్యులే లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. రద్దీని అదునుగా చేసుకుని దొంగలు పట్టపగలే ఓ మహిళ బ్యాగులోని ఎనిమిది తులాల బంగారాన్ని అత్యంత చాకచక్యంగా దోచుకెళ్లారు. కొలచారం మండలానికి చెందిన చింతలగారి శ్రావణి, ప్రవీణ్ దంపతులు మెదక్ వెళ్లగా, తిరిగి వస్తుండగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు మాంబోజీపల్లి సంతలో ఆగారు. మార్కెట్లో జనసందోహం ఎక్కువగా ఉన్నప్పుడు, దొంగలు శ్రావణిని వెంబడించి ఆమె దృష్టి మరల్చారు. ఆమె చేతిలోని హ్యాండ్‌బ్యాగ్ జిప్ తీసి లోపల ఉన్న సుమారు 8 లక్షల విలువైన ఆభరణాలను అపహరించారు.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!
అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!
టాయిలెట్ లేదని.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాడు
మృత్యుంజయుడు.. పిడుగు పడినా బతికాడు
పాత ప్యాంటు జేబులో లాటరీ టికెట్.. చివరి నిమిషంలో అద్భుతం

