చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మురళి అనే యువకుడు గత నెల 25న రెండో పెళ్లి చేసుకున్న మూడు రోజులకే అంటే 28వ తేదీన మృతిచెందాడు. స్థానిక పెద్ద చెరువులో మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లి చేసుకుని, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.