గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి 2 కొత్త సర్వీసులు ..ఆ రెండు ప్రధాన నగరాలకు కనెక్టింగ్ షురూ!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి ప్రధాన గేట్‌వేగా వెలుగొందుతున్న విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులకు మరో సరికొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో గన్నవరం నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసి, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరాలకు కొత్త నేరుగా విమాన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికులకు మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. గన్నవరం నుంచి వారణాసి, కోల్‌కతా నగరాలకు నూతన విమాన సర్వీసులను ప్రారంభించింది. పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథుని దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగపడనుంది. ఇప్పటివరకు ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాల్సిన అవసరం ఉండగా.. ఇకపై విజయవాడ నుంచి నేరుగా కాశీకి చేరుకునే అవకాశం కలిగింది. దీంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యం పెరగనుంది.
అలాగే తూర్పు భారతదేశంలోని కీలక నగరమైన కోల్‌కతాకు నేరుగా విమాన సదుపాయం అందుబాటులోకి రావడం వ్యాపార, ఉద్యోగ, విద్యా అవసరాల కోసం వెళ్లే వారికి ప్రయోజనం కలిగించనుంది. అమరావతి రాజధాని ప్రాంతానికి గేట్‌వేగా మారుతున్న గన్నవరం విమానాశ్రయంలో కనెక్టివిటీని పెంచే దిశగా ఈ కొత్త సర్వీసులు కీలక అడుగుగా మారనున్నాయి. దేశంలోని మరిన్ని ప్రధాన నగరాలకు విమాన సౌకర్యాలు విస్తరించేందుకు విమానయాన సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
First direct flight to Varanasi from any airport of Andhrapradesh. Useful for South Andhra , Godavari districts, Akp people travelling to Varanasi from Vijayawada https://t.co/p4Zhd1gzBm
— Vizag-Railways-Buses-Flights-info (@VizagRailways) August 13, 2026
కొత్త విమాన సర్వీసులపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నుంచి మరిన్ని నగరాలకు నేరుగా ప్రయాణించే అవకాశం కలగడం అభివృద్ధికి సంకేతంగా భావిస్తున్నారు.




