AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినాయక చవితికి స్పెషల్.. ఇంట్లోనే సాఫ్ట్‌గా మోదక్‌లు ఇలా చేసుకోండి!

హిందువులు పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఈ రోజున వినాయకుడిని భక్తితో పూజిస్తారు. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా ఘనంగ జరుపుకుంటారు. పండ్లు, సాంప్రదాయ మిఠాయిలను సమర్పిస్తారు. అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి ఉకడిచే మోదక్. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 09, 2026 | 11:47 AM

Share
మోదకాలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు నీరు, ఒక టీస్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు, కొబ్బరి-బెల్లం పూరణం కోసం, ఒక కప్పు తాజాగా తురిమిన కొబ్బరి, పావు కప్పు తురిమిన పొడి చేసిన బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టీస్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి.

1 / 5
మోదకాల తయారీ విధానం:  ఒక కప్పు నీటిని తీసుకుని ఒక పాత్రలో మరిగించి, దానిలో చిటికెడు ఉప్పు, ఒక  టేబుల్ స్పూన్ కూడా  నెయ్యి  కూడా దీనిలో వేయాలి. ఈ నీరు మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న కప్పు బియ్యం పిండిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు దీనిని కలపాలి. ఆ తర్వాత మంటను ఆపి మూతపెట్టి కొద్దిసేపు పక్కన పెట్టాలి.

2 / 5

కొబ్బరి-బెల్లం పూరణం: మరో పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, తురిమిన కొబ్బరి పొడి , బెల్లం కూడా దీనిలో వేసి మీడియం మంటపై దీనిని మెల్లిగా కలుపుతూ మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. బెల్లం కరిగిన తరవాత ఒక యాలకుల పొడి, ఇంకా మీరు  కావాలంటే  పంచదార పొడి, డ్రైఫ్రూట్స్ వేసి దీనిని మంచిగా కలిపి చల్లారనివ్వాలి.

3 / 5

మోదక్ పిండి తయారీ: ఇప్పుడు బియ్యం పిండిని తీసుకుని కొద్దిగా వేడి మీద  ఉన్నప్పుడే మీరు చేతులకు నెయ్యి రాసుకుని దీనిని  మెత్తగా పిండిలా కలపాలి. పిండి మరి పొడిగా మీకు అనిపిస్తే కొద్దిగా వేడి నీరు చల్లి గట్టిగా చేసుకోవాలి. మోదక్‌ల ను తీసుకోవాలి. ఈ  పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చేతితో పలుచగా చేయాలి.

4 / 5
మధ్యలో కొబ్బరి-బెల్లం పూరణం పెట్టి, చుట్టూ అంచులను మడతలుగా చేస్తూ వాటిని మెల్లిగా మోదక్ ఆకారం ఇవ్వాలి. ఇంకా వీటిని  ఆవిరితోనే ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్రను తీసుకుని దానిలో నీరు మరిగించి, ఆ మోదక్‌లను నెయ్యి రాసిన ప్లేట్‌పై పెట్టి 15 నిమిషాలు ఆవిరితోనే ఉడికించాలి. బయట మెత్తగా, మోదక్‌లు సెట్ అయిన తర్వాత తీసి వేడిగా ప్రసాదంగా పెట్టండి.

5 / 5
Follow Us