AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన రాగి బూరెలు.. మెత్తగా, పొంగుతూ రావడానికి అద్భుత చిట్కాలు

రాగి బూరెలు మన సంప్రదాయ వంటకాల్లో ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ చాలామందికి వీటిని మెత్తగా, పొంగేలా చేయడం కష్టంగా అనిపిస్తుంది. సరైన పద్ధతిలో, కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రతిసారీ అద్భుతమైన రాగి బూరెలను తయారుచేసుకోవచ్చు. ఇక్కడ మెత్తటి, పొంగే రాగి బూరెలు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Prasanna Yadla
|

Updated on: Sep 09, 2026 | 1:02 PM

Share

1 / 5
తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగిపిండి,  ఒక కప్పు గోధుమ పిండి , కొద్దిగా ఉప్పు,  పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, 
రెండు టీ స్పూన్స్ నువ్వులు , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర పొడి,  ఒక కప్పు బెల్లం తురుము, 
పావు నీళ్లు  కప్పు బెల్లం కరిగించడానికి అవసరమైనంత తీసుకోవాలి.

తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు గోధుమ పిండి , కొద్దిగా ఉప్పు, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, రెండు టీ స్పూన్స్ నువ్వులు , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర పొడి, ఒక కప్పు బెల్లం తురుము, పావు నీళ్లు కప్పు బెల్లం కరిగించడానికి అవసరమైనంత తీసుకోవాలి.

2 / 5
పిండి మిశ్రమం సిద్ధం చేయడం :  ముందుగా, ఒక బౌల్‌లో ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ రెండు పిండిలను కలిపి వేయడం వల్ల బూరెలు మెత్తగా వస్తాయి. దీనిలో చిటికెడు ఉప్పు, 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము (లేదా పచ్చి కొబ్బరి), 2 టీస్పూన్ల నువ్వులు (వేయించనివి), 1 టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నువ్వులు ఇష్టం లేకపోతే వాటిని వేయడం మానేయవచ్చు. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక కప్పు బెల్లం తురుము, 1/4 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో బెల్లం కరిగే వరకు ఉంచాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు, తక్కువ తినేవారు తగ్గించుకోవచ్చు.

3 / 5

 బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి.కరిగిన బెల్లం నీళ్లను పిండి మిశ్రమంలో వడగట్టాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే తొలగిపోతాయి. బెల్లం నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగా స్పూన్‌తో బాగా కలిపి, తర్వాత చేత్తో ప్రెస్ చేస్తూ కలపాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలపకూడదు. పిండి కొద్దిగా లూజ్‌గా, చేతికి అంటుకునేలా ఉండాలి. గట్టిగా కలిపితే బూరెలు పొంగవు, చెక్కల్లాగా ఉంటాయి. పిండిని ఎంత మెత్తగా కలిపితే బూరెలు అంత బాగా పొంగుతాయి.

4 / 5
 పిండిని కలిపిన తర్వాత, చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన ఈ ఉండలను పెట్టి, బూరెల్లాగా ఒత్తుకోవాలి. బూరెలు మరీ పల్చగా కాకుండా, కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. పలుచగా ఒత్తినా పొంగకుండా చెక్కల్లాగా అవుతాయి. స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పెట్టి, బాగా వేడెక్కనివ్వాలి. నూనె చాలా వేడిగా ఉండాలి. నూనె వేడైన తర్వాత, ఒత్తుకున్న బూరెలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. బూరెను నూనెలో వేసిన వెంటనే గరిటెతో బూరెపై నూనెను వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే బూరెలు బాగా పొంగుతాయి. ఒక బూరె పొంగి పైకి తేలాక, ఇంకొక బూరెను వేసుకోవచ్చు. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి, నూనె నుండి తీసి ప్లేట్‌లో వేసుకోవాలి.

5 / 5
Follow Us