నారాయణపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఎనిమిది సంవత్సరాలుగా రొమ్ము గడ్డతో బాధపడుతున్న ఓ మహిళకు 3.5 కిలోల ఫిలోడెస్ ట్యూమర్ను తొలగించారు. ఈ విజయంతో మహిళ ఎనిమిదేళ్ల బాధ నుంచి విముక్తి పొందింది. ఇది ప్రభుత్వ ఆసుపత్రి సాధించిన గొప్ప విజయం.