ఇ-కామర్స్ డెలివరీ సర్వీస్‌లపై 5% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ!
ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ డెలివరీ సేవలపై కేంద్రం కొత్తగా 5 శాతం జీఎస్టీ విధించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇది కొత్త పన్ను కాదని, గతంలో 18 శాతంగా ఉన్న జీఎస్టీని 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 5 శాతానికి తగ్గించినట్లు వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మకుండా, అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని ప్రజలకు సూచించింది.
ఇ-కామర్స్ డెలివరీ సేవలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా 5 శాతం జీఎస్టీ విధించిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి అవి పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నదంతా తప్పుడు ప్రచారమని, ప్రజలు వాటిని నమ్మవద్దని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా ఈ వదంతులకు చెక్ పెట్టింది. ఫుడ్ డెలివరీ యాప్‌లు మరియు ఇతర ఇ-కామర్స్ డెలివరీ సేవలపై జీఎస్టీ కౌన్సిల్ కొత్తగా ఎలాంటి పన్నులను తీసుకురాలేదని అధికారులు స్పష్టం చేశారు. వాస్తవానికి ఈ సేవలపై గతంలో 18 శాతం జీఎస్టీ అమల్లో ఉండేదని తెలిపారు. అయితే, ఇటీవలి 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను భారాన్ని తగ్గించే ఉద్దేశంతో దాన్ని ఏకంగా 5 శాతానికి తగ్గించినట్లు వివరించారు. కాబట్టి ఇది కొత్తగా విధించిన పన్ను కాదని, ఇప్పటికే ఉన్న పన్ను రేటును తగ్గించడమేనని తేల్చిచెప్పారు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అందించే అన్ని డెలివరీ సర్వీసులకు ఇకపై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను, అవాస్తవాలను గుడ్డిగా నమ్మవద్దని, ఎలాంటి సమాచారమైనా అధికారిక వర్గాల ద్వారా ముందుగా తనిఖీ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎలాంటి ధ్రువీకరణ లేకుండా ఇలాంటి అవాస్తవ వార్తలను ఇతరులకు షేర్ చేసి ఆందోళనలు సృష్టించవద్దని ప్రజలను కోరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
PF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్, విత్‌డ్రా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!
లక్షలాదిమంది మనసు గెలిచిన అమ్మ.. బిడ్డను వీపుపై మోస్తూ..
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?

