AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై  ప్రభుత్వం నిర్ణయం!

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!

Phani CH
|

Updated on: Oct 14, 2026 | 9:13 PM

Share

హైదరాబాద్‌లో ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ ధరలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధమైంది. ప్రస్తుత చార్జీలు భారంగా ఉన్నాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రస్తుతం రోజువారీ పాస్‌ ధర రూ.400, నెలవారీ పాస్‌ ధర రూ.8,500గా ఉంది. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని సరసమైన ధరలు నిర్ణయించేందుకు అధికారులు త్వరలో సమావేశం కానున్నారు.

హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ చార్జీలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయంటూ ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్‌కు రూ. 400 అంటే..మెట్రోకు రూ. 300, ఆర్టీసీకి రూ. 100 వసూలు చేస్తుండగా, నెలవారీ పాస్‌కు రూ. 8,500 మెట్రోకు రూ. 7,000, ఆర్టీసీకి రూ. 1,500 చొప్పున ధరలు నిర్ణయించారు. ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు రావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని చార్జీలను తగ్గించే అంశంపై పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని, అంతేకాని ప్రయాణికులపై అదనపు భారం మోపడం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రయాణికుల ఆర్థిక పరిస్థితులను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ధరలతో కొత్త చార్జీలను ఖరారు చేస్తామని, ఈ పథకం ద్వారా ప్రజలకు నిజమైన మేలు చేకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PF ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌.. ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!

పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!

హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు! మూడు నగరాలకు హైస్పీడ్ జర్నీ!

డిగ్రీ అర్హతతో రైల్వేలో 3,548 ఉద్యోగాలు.. RRB NTPC నోటిఫికేషన్ విడుదల!

Follow Us