AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!

సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!

Phani CH
|

Updated on: Oct 14, 2026 | 10:42 PM

Share

తెలంగాణ మంత్రి సీతక్క దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొన్న లయన్‌ సఫారీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సింహాలు వాహనం దగ్గరకు వచ్చిన సమయంలో, చేతిలో కర్ర పట్టుకుని రెండు సింహాల వెనుక ఆమె ధైర్యంగా నడుస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. బతుకమ్మ వేడుకల కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన సీతక్క, తక్కువ నీటితో సాగు చేసే ఆధునిక వ్యవసాయ పద్ధతులపైనా అధ్యయనం చేసినట్లు సమాచారం.

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఆమె సింహాల సఫారీకి వెళ్లగా, అక్కడ సింహాల వెంటే ఎంతో ధైర్యంగా నడుస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. సీతక్క ధైర్యం చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని తెలంగాణ సంఘం అక్కడ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు మంత్రి సీతక్కను ఆహ్వానించారు. అయితే సీతక్క ఈ పర్యటనను కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని.. తక్కువ నీటితో సాగు చేసే ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆమె అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే ఆమె అధికారిక పర్యటనలో భాగంగా లయన్ సఫారీని సందర్శించారు. ఈ సందర్భంగా సింహాలు వారు ప్రయాణిస్తున్న వాహనం వద్దకు రాగా, సీతక్క ఏమాత్రం భయపడకుండా చేతిలో కర్ర పట్టుకుని రెండు సింహాల వెనుక ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నడుస్తూ కనిపించారు. ఈ సాహస వీడియోను ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మంత్రి సీతక్క తెగువను కొనియాడుతున్నారు. ఆమె ఆదివాసీ నేపథ్యం, గతంలో ప్రజా పోరాటాల్లో పనిచేసిన అనుభవమే ఈ ధైర్యానికి కారణమని కామెంట్లు పెడుతున్నారు. పీహెచ్‌డీ, లా పూర్తి చేసి ఉన్నత స్థాయికి ఎదిగినా, ఆమెలోని ఆత్మస్థైర్యం ఎప్పటికీ చెక్కుచెదరలేదని పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!

వ్యాపారులకు గుడ్‌ న్యూస్‌.. యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

‘విజయ్’ పేరును స్టాలిన్’గా మార్చిన AI.. నెట్టింట రచ్చ!

APSRTC గుడ్ న్యూస్.. విశాఖ To భోగాపురం.. కొత్తగా నెలవారీ పాస్‌లు

ఇ-కామర్స్‌ డెలివరీ సర్వీస్‌లపై 5% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ!

Follow Us