AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ప్రత్యక్ష ప్రసారం

Shaik Madar Saheb
|

Updated on: Nov 11, 2026 | 11:00 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భావానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలో పార్టీ పేరును ప్రకటించనున్నారు. రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజాసమస్యలు, అభివృద్ధి, యువతకు ప్రాధాన్యమిస్తూ రాజకీయ ప్రస్థానం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త పార్టీతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. విజయవాడ వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. ఏపీలోని ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం పార్టీని స్థాపిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రజాసమస్యలు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టంచేశారు. ముహూర్తం ప్రకారం.. 11వ నెల.. 11వ తేదీ.. 11 గంటల.. 11 నిమిషాలకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించనున్నారు. రాయలసీమ పౌరుషాన్ని నిలబెట్టేందుకు ఏకాదశి రోజున పార్టీని స్థాపించబోతున్నట్టు గతంలో తెలిపిన విజయసాయిరెడ్డి.. ఇవాళ ఆ మేరకు కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలో ప్రధానమైన రెండు పార్టీలు, కుటుంబాల ఆధిపత్యానికి ముగింపు పలుకుతామన్నారు. అందుకోసం యువతకు పెద్దపీట వేస్తామన్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి పార్టీవైపు కొందరు నేతలు చూస్తుండటంతో.. ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయన్న ఆసక్తి నెలకొంది.

Follow Us