AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!

బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!

Phani CH
|

Updated on: Oct 14, 2026 | 10:40 PM

Share

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో దుర్గా పూజకు ముందు కొత్త వివాదం మొదలైంది. బిర్యానీ, మాంసం వంటి ఆహార పదార్థాలను హిందూ దుకాణాల నుంచే కొనాలని కోరుతూ హిందూ జాగరణ్‌ మంచ్‌ పేరుతో పోస్టర్లు వెలిశాయి. హిందూ వ్యాపారులకు మద్దతుగా ఈ పోస్టర్లు పెట్టినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే, మతం ఆధారంగా ప్రజలను విభజించే ప్రయత్నమంటూ టీఎంసీ, వామపక్ష నేతలు విమర్శించారు.

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో దుర్గా పూజ ఉత్సవాలకు ముందు కొత్త వివాదం రాజుకుంది. బిర్యానీ, మాంసం వంటి ఆహార పదార్థాలు కేవలం హిందూ దుకాణాల నుంచే కొనుగోలు చేయాలంటూ ‘హిందూ జాగరణ్ మంచ్’ పేరుతో వెలిసిన పోస్టర్లు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పండుగ వేళ మత ప్రాతిపదికన ప్రజలను విభజించేలా ఉన్న ఈ పిలుపుపై రాజకీయంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్ నివాసానికి సమీపంలోని పూజా పండాల్ వద్ద ఈ పోస్టర్లు ఎక్కువగా కనిపించడం చర్చనీయాంశమైంది. “బిర్యానీ తినడంపై నిషేధం లేదు, కానీ హిందూ దుకాణాల నుంచే కొనండి” అంటూ వీటిలో పేర్కొన్నారు. ఈ పోస్టర్లు తామే వేశామని హిందూ జాగరణ్ మంచ్ ప్రతినిధి అభిషేక్ దాస్ అంగీకరించారు. హిందూ వ్యాపారులకు మద్దతుగా నిలిచేందుకే ఈ పోస్టర్లు వేశామని, ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమేనని ఆయన వివరించారు. అయితే ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. మతం, కులం పేరుతో ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని లెఫ్ట్ మరియు టీఎంసీ నేతలు ఆరోపించారు. ఆహార ఎంపిక అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని, పండుగ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం బెంగాల్ సామరస్య సంస్కృతికి విరుద్ధమని మండిపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై స్థానిక మంత్రి శంకర్ ఘోష్ స్పందిస్తూ, పోస్టర్లు ఎవరు వేశారో తనకు తెలియదని, వారే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యాపారులకు గుడ్‌ న్యూస్‌.. యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం

‘విజయ్’ పేరును స్టాలిన్’గా మార్చిన AI.. నెట్టింట రచ్చ!

APSRTC గుడ్ న్యూస్.. విశాఖ To భోగాపురం.. కొత్తగా నెలవారీ పాస్‌లు

ఇ-కామర్స్‌ డెలివరీ సర్వీస్‌లపై 5% జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ!

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ!

Follow Us