AP MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. రిజల్ట్స్ లైవ్ వీడియో
ఆంధ్రప్రదేశ్‌లో 365 కేంద్రాల్లో MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 9,062 టేబుళ్లపై పటిష్ట భద్రత మధ్య కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. తొలి ఫలితాలు నాలుగు గంటల తర్వాత వచ్చే అవకాశం ఉండగా, కౌంటింగ్ రాత్రి వరకు కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రతతోపాటు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్టు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు బాడీ వోర్న్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌లు తెరిచి లెక్కింపు ప్రారంభిస్తారు. నాలుగు గంటల తర్వాత తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ZPTC ఫలితాలు మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం ఉంది.. కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగనుంది. బ్యాలెట్ బాక్సుల్లోని గులాబీ రంగు పేపర్లు MPTC ఓట్లు.. తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ZPTC ఓట్లు.. MPTC, ZPTC బ్యాలెట్ పేపర్లను వేర్వేరుగా 25 చొప్పున కట్టలుగా ఏర్పాటు చేసి అనంతరం లెక్కిస్తారు. 50 శాతం టేబుళ్లపై ZPTC ఓట్లు, మిగిలిన 50 శాతం టేబుళ్లపై MPTC ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి పరిశీలించి అనంతరం ఫలితం ప్రకటిస్తారు
కౌంటింగ్ కోసం 9వేల 62 టేబుళ్లు ఏర్పాటు చేయగా… 11వేల మంది సూపర్‌వైజర్లు, 28వేల 692 మంది సహాయకులను నియమించారు. కౌంటింగ్ టేబుళ్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చెరో 50 శాతం కేటాయించారు. ప్రతి రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.
కాగా.. 77 జెడ్పీటీసీలు, 2వేల 51 ఎంపీటీసీలు ఏకగ్రీవంకాగా… మిగిలిన 582 జెడ్పీటీసీ… 7వేల767 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు ఇవాళ జరుగుతోంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైవున్న 21వేల 12మంది అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలనుంది.
ప్యాసింజర్ లగేజ్ చెక్ చేసిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్
మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?
హాస్టల్ గదుల్లో నాగుపాములు, తేళ్లు..విద్యార్థినులను కరిచిన ఎలుకలు
డైరెక్టర్ అవుదామనుకున్నాడు.. కట్ చేస్తే దొంగయ్యాడు!
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!
