AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ZPTC, MPTC Elections Result Highlights : రెండు పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటిన కూటమి అభ్యర్థులు!

AP ZPTC, MPTC Polls 2026 Result Live Updates in Telugu: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల ప్రకారం జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 229 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన 36, వైఎస్సార్‌సీపీ 20, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 4,823 స్థానాలను దక్కించుకుంది. జనసేన 644, వైఎస్సార్‌సీపీ 1,050, బీజేపీ 130, స్వతంత్రులు 110, కాంగ్రెస్ 2, ఇతరులు 20 స్థానాల్లో విజయం సాధించారు. ఏకగ్రీవాల విషయంలోనూ టీడీపీ ముందంజలో నిలిచింది. జెడ్పీటీసీల్లో 71 స్థానాలను ఏకగ్రీవం చేసుకోగా, ఎంపీటీసీల్లో ఏకంగా 1,780 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. జనసేన 107, వైఎస్సార్‌సీపీ 89, బీజేపీ 53 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. నవంబర్ 7వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. అప్పటికి వెల్లడైన ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా, మిగిలిన స్థానాల్లో లెక్కింపు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

AP ZPTC, MPTC Elections Result Highlights :  రెండు పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటిన కూటమి అభ్యర్థులు!
Ap Zptc, Mptc Election 2026 Results
Balaraju Goud
|

Updated on: Nov 07, 2026 | 10:16 PM

Share

కౌంటింగ్‌ కోసం 9వేల 62 టేబుళ్లు ఏర్పాటు చేయగా… 11వేల మంది సూపర్‌వైజర్లు, 28వేల 692 మంది సహాయకులను నియమించారు. కౌంటింగ్ టేబుళ్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చెరో 50 శాతం కేటాయించారు. ప్రతి రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మొదట పోస్టల్ ఓట్లు… ఆ తర్వాత బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు

77 జెడ్పీటీసీలు, 2వేల 51 ఎంపీటీసీలు ఏకగ్రీవంకాగా… మిగిలిన 582 జెడ్పీటీసీ… 7వేల767 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైవున్న 21వేల 12మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. పరిషత్‌ ఎన్నికల్లో కోటీ 85లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పరిషత్‌ ఎన్నికల్లో 70.72శాతం పోలింగ్‌ నమోదైంది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 82.51శాతం.. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01శాతం ఓటింగ్‌ జరిగింది. MPTC ఎన్నికలకు గులాబీ రంగు పేపర్‌… ZPTC ఎన్నికలకు తెలుగు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగించారు. ముందుగా వీటిని వేరుచేసి కట్టలు కడతారు. అనంతరం, వెయ్యి చొప్పున ఓట్లను లెక్కిస్తారు.

కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 40వేల 679 మంది పోలీసులను మోహరించారు. బందోబస్తులో 135 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలు, 572 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,412 మంది ఎస్సైలు పాల్గొననున్నారు. సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు బాడీ వోర్న్ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు.

ఎన్నికల ఫలితాలను ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Nov 2026 10:13 PM (IST)

    పరిషత్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తిరుగులేని ఆధిక్యం!

    అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల ప్రకారం జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 229 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన 36, వైఎస్సార్‌సీపీ 20, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరికొన్న చోట్ల కౌటింగ్ కొసాగుతోంది. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడాల్సి ఉంది.

    ఎంపీటీసీ ఎన్నికల్లోనూ టీడీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 4,823 స్థానాలను దక్కించుకుంది. జనసేన 644, వైఎస్సార్‌సీపీ 1,050, బీజేపీ 130, స్వతంత్రులు 110, కాంగ్రెస్ 2, ఇతరులు 20 స్థానాల్లో విజయం సాధించారు.

    ఏకగ్రీవాల విషయంలోనూ టీడీపీ ముందంజలో నిలిచింది. జెడ్పీటీసీల్లో 71 స్థానాలను ఏకగ్రీవం చేసుకోగా, ఎంపీటీసీల్లో ఏకంగా 1,780 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. జనసేన 107, వైఎస్సార్‌సీపీ 89, బీజేపీ 53 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నాయి.

    రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. నవంబర్ 7వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. అప్పటికి వెల్లడైన ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా, మిగిలిన స్థానాల్లో లెక్కింపు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

  • 07 Nov 2026 10:08 PM (IST)

    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమిదే హవా

    ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    సోంపేట – కృష్ణ(టీడీపీ)

    కవిటి – కృష్ణారావు(టీడీపీ)

    కంచిలి – ఆనంద్(టీడీపీ)

    ఇచ్ఛాపురం-నీలవేణి(జనసేన)

    పలాస – దువ్వాడ సంతోష్‌(టీడీపీ)

    మందస – జ్యోతి(జనసేన)

    వజ్రపుకొత్తూరు – విజయ్(టీడీపీ)

    టెక్కలి – సతీష్‌(టీడీపీ)

    కోటబొమ్మాళి – శైలజ(టీడీపీ)

    నందిగాం – చంద్రశేఖర్(టీడీపీ)

    సంతబొమ్మాళి – పద్మ(టీడీపీ)

    జలమూరు – రాంచంద్రరావు(టీడీపీ)

    పాతపట్నం – శ్రీనివాసరావు (టీడీపీ)

    మెళియాపుట్టి – చామంతి(టీడీపీ)

    హిర – త్రివేణి(బీజేపీ)

    కొత్తూరు – శ్రీదేవి(టీడీపీ)

    ఎల్.ఎన్.పేట – భవాని(జనసేన)

    పొందూరు – సుజాత(టీడీపీ)

    ఆముదాలవలస – సుజాత(టీడీపీ)

    సరుజుబ్జిల్లి – దివ్య(జనసేన)

    ఎచ్చెర్ల – విశ్వక్‌సేన్(జనసేన)

    రణస్థలం – లలిత(టీడీపీ)

  • 07 Nov 2026 09:24 PM (IST)

    బొత్స సత్యనారాయణ సోదరి విజయం

    విజయనగరం జిల్లా గుర్ల ZPTC స్థానం వైసీపీ కైవసం

    బొత్స సత్యనారాయణ సోదరి వెంకటలక్ష్మి గెలుపు

    టీడీపీ అభ్యర్థిపై 316 ఓట్ల మెజార్టీతో విజయం

  • 07 Nov 2026 09:03 PM (IST)

    వివక్ష లేని పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: నారా లోకేష్

    పరిషత్ ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని, అభివృద్ధి, సంక్షేమానికి తమ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, నేతలు, కార్యకర్తల సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. విజయానికి కృషి చేసిన కూటమి నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గెలుపుతో అహంకారం దరిచేరనివ్వకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. వివక్ష లేని పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవకు మరోసారి పునరంకితం కావాలని లోకేష్‌ పేర్కొన్నారు.

  • 07 Nov 2026 09:00 PM (IST)

    ఎమ్మిగనూరులో వైసీపీ ఆందోళనతో ఉద్రిక్తత

    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత

    ఎర్రబాడు ఎంపీటీసీ ఫలితంపై వైసీపీ ఆందోళన

    YCP అభ్యర్థి రాముడు గెలిచినా ప్రకటించలేదంటూ నిరసన

    నాలుగుసార్లు రీకౌంటింగ్ చేయడంపై వైసీపీ అభ్యంతరం

    300 ఓట్ల మెజార్టీ 11 ఓట్లకు తగ్గిందంటూ ఆగ్రహం

    గెలుపు డిక్లరేషన్ ఇవ్వాలంటూ వైసీపీ డిమాండ్

    డీఎస్పీ కాళ్లు పట్టుకుని వేడుకున్న వైసీపీ అభ్యర్థి రాముడు

  • 07 Nov 2026 08:41 PM (IST)

    జనసేన విజేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ

    తెనాలి, కొల్లిపర ప్రాంతాల్లో ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన ప్రజాప్రతినిధులతో మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు అభినందనలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని విజేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

  • 07 Nov 2026 08:30 PM (IST)

    కూటమి విజయంతో ముందుగానే దీపావళిః పవన్ కల్యాణ్

    రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో కూటమి విజయంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంతో ప్రజలకు ముందుగానే దీపావళి వచ్చిందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ దీపాలు వెలుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో మరింత బాధ్యతగా పనిచేస్తామని పవన్ కల్యాణ్ సందేశమిచ్చారు.

  • 07 Nov 2026 08:03 PM (IST)

    గరివిడిలో జెడ్పీటీసీగా బొత్స పూజిత విజయం

    గరివిడిలో కళావెంకట్రావు కోడలు కిమిడి సంధ్య ఓటమి

    గరివిడిలో జెడ్పీటీసీగా బొత్స పూజిత విజయం

    కిమిడి సంధ్యపై 1599 ఓట్ల మెజార్టీతో గెలుపు

  • 07 Nov 2026 08:02 PM (IST)

    వైఎస్ జగన్‌పై వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు..!

    టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ వ్యవహారం ‘దొంగే దొంగ అన్నట్టుగా’ ఉందని వ్యాఖ్యానించారు. తప్పు చేసి ఎదుటివారిపై నిందలు వేయడం జగన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. వైసీపీ నేత అప్పిరెడ్డిపై గతంలో 19 కేసులు నమోదయ్యాయని వర్ల రామయ్య ఆరోపించారు. రౌడీషీట్ రద్దు చేసినంత మాత్రాన నేర చరిత్ర చెరిగిపోదని అన్నారు. అప్పిరెడ్డిపై బెదిరింపులు, దాడులకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్స్ రోడ్డుపైకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరపాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

  • 07 Nov 2026 08:00 PM (IST)

    పిఠాపురంలో జనసేనకు షాక్.. రెబల్‌ అభ్యర్థి విన్!

    పిఠాపురం: పిఠాపురంలో జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కందరాడ ఎంపీటీసీ స్థానంలో జనసేన ఎంపీపీ అభ్యర్థి పిల్లా దినేష్‌ ఓటమి పాలయ్యారు. జనసేన రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పిల్లా శివశంకర్‌ 287 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కందరాడలో ఒకే ఇంటిపేరుతో నలుగురు అభ్యర్థులు బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. తొలుత శివశంకర్‌కు బీఫామ్‌ ఇచ్చిన జనసేన పార్టీ ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. దీంతో ఆయన రెబల్‌గా ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసి గెలుపొందడంతో శివశంకర్‌పై జనసేన సస్పెన్షన్‌ వేటు వేసింది.

  • 07 Nov 2026 07:58 PM (IST)

    ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిరసన..

    శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిరసనకు దిగారు. తాడిమర్రి మండలంలో గెలుపొందిన స్థానాలను ప్రకటించకుండా ఎన్నికల అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి వైసీపీ ఏజెంట్లను బయటకు పంపడంపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులను ప్రశ్నించేందుకు ధర్మవరం RDO కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • 07 Nov 2026 07:57 PM (IST)

    రాజానగరం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..!

    తూర్పుగోదావరి: రాజానగరం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోరుకొండలో తొలుత వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరకు కూటమి అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఫలితంపై అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు రీకౌంటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. రీకౌంటింగ్‌ జరపాలని కోరుతూ కౌంటింగ్‌ కేంద్రం గేటు ఎదుట బైఠాయించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • 07 Nov 2026 07:55 PM (IST)

    అనకాపల్లి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్

    మొత్తం 24 ZPTC స్థానాలు కైవసం చేసుకున్న కూటమి

    ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయిన వైసీపీ

    టీడీపీ – 18

    జనసేన – 4

    బీజేపీ – 2

  • 07 Nov 2026 07:52 PM (IST)

    బొత్స కుమార్తెపై సామాన్య మహిళ ఘన విజయం..!

    విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మారిన బొండపల్లి ZPTC స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై టీడీపీ అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. 5,136 ఓట్ల భారీ మెజారిటీతో నీరజ గెలుపొందడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బొత్స కుమార్తె పోటీలో ఉండటంతో ఈ స్థానాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బొత్స స్వయంగా ప్రచారం చేసినప్పటికీ వైసీపీ అభ్యర్థి విజయం సాధించలేకపోయారు. ఈ ఫలితంతో ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో బొండపల్లి ZPTC ఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది.

  • 07 Nov 2026 07:51 PM (IST)

    ఏపీలో కూటమి హవా.. 77 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం!

    ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ఆధిక్యం ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి 76 స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. తెలుగుదేశం పార్టీ 71 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, జనసేన 2 స్థానాల్లో ఏకగ్రీవ విజయం సాధించాయి. మరోవైపు వైసీపీ ఒక జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో ఏకగ్రీవ స్థానాల్లో కూటమి పార్టీలకు మెజారిటీ దక్కింది.

  • 07 Nov 2026 07:46 PM (IST)

    ఇదే ఉత్సాహం, స్ఫూర్తితో 2029 ఎన్నికలకు సిద్ధం: పల్లా శ్రీనివాస్‌

    సంక్షేమం, అభివృద్ధికి ప్రజలు మద్దతు పలికారని, కూటమి ప్రభుత్వ పాలనపై నమ్మకంతోనే ఎన్నికల్లో ఓటు వేశారని టీడీపీ నేత పల్లా శ్రీనివాస్‌ అన్నారు. ఎన్నికల్లో సాధించిన విజయం ప్రజలకు కూటమిపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తమ తీర్పుతో తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు చేసిందని ఆరోపించారు. అనేక అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ఇదే ఉత్సాహం, స్ఫూర్తితో 2029 ఎన్నికలకు సిద్ధమవుతామని పల్లా శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

  • 07 Nov 2026 07:45 PM (IST)

    పోలీసులతో మాజీ ఎంపీ గోరంట్ల వాగ్వాదం

    సత్యసాయి: ధర్మవరంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నిరసన

    చెన్నేకొత్తపల్లిలో రీకౌంటింగ్ జరపాలని డిమాండ్‌

    కౌంటింగ్ కేంద్రం ఎదుట వైసీపీ శ్రేణుల బైఠాయింపు

  • 07 Nov 2026 07:43 PM (IST)

    SECని కలిసిన టీడీపీ నేతలు.. రోజా సహా వైసీపీ నేతలపై ఫిర్యాదు!

    కౌంటింగ్ ప్రక్రియకు మాజీ మంత్రి రోజాతో పాటు పలువురు వైసీపీ నేతలు ఆటంకం కలిగిస్తున్నారని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)కు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ సమయంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని SECని కోరారు. ఈ మేరకు టీడీపీ నేతలు ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ ఫిర్యాదును అందజేశారు.

  • 07 Nov 2026 07:43 PM (IST)

    సంబరాల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి

    ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన సంబరాలు చేసుకోవడం కాకుండా, ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. యల్లనూరు మండలంలో MPTC, ZPTCలుగా గెలిచిన అభ్యర్థులు బాణాసంచా కాల్చడం, ఊరేగింపులు నిర్వహించడం కంటే ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని కోరారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. పదవి అనేది హోదా కాదని, ప్రజలు అప్పగించిన బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజల ఓట్లతో గెలిచి వారికే దూరంగా ఉండటం సరికాదన్నారు. సంబరాలు కొన్ని గంటలే ఉంటాయని, ప్రజలకు చేసే సేవ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే విజయం సాధించిన ప్రజలకు నిజమైన కృతజ్ఞతలు తెలిపినట్లవుతుందని జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • 07 Nov 2026 07:37 PM (IST)

    నెల్లూరు రూరల్‌లో క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ..!

    నెల్లూరు రూరల్‌లో 1 జడ్పీటీసీ, 12 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం.

    నెల్లూరు రూరల్‌లో ఒక్కచోట కూడా గెలవని వైసీపీ.

  • 07 Nov 2026 07:36 PM (IST)

    సొంత జిల్లాలో బొత్సకు బిగ్ షాక్..!

    ఉమ్మడి విజయనగరం జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    కురుపాం – చంద్రదేవ్‌ (టీడీపీ)

    గరివిడి – బొత్స పూజిత (టీడీపీ)

    తెర్లాం – సిరి సహస్ర(టీడీపీ)

  • 07 Nov 2026 06:19 PM (IST)

    ఎంపీటీసీలుగా తండ్రీ కూతురు విజయం

    పార్వతీపురం మన్యం జిల్లాలో అనూహ్య పరిణామం

    పాచిపెంట మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందిన తండ్రి, కూతురు

    మాతుమూరు, పాంచాలి ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ అభ్యర్థులు

    రెండు ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందిన తండ్రీ కూతురు జి. యుగంధర్, కావ్య

  • 07 Nov 2026 06:12 PM (IST)

    అనంతగిరి జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ విజయం

    అల్లూరి జిల్లా అనంతగిరి జెడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి విజయం

    2,892 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి జయవర్థిని

  • 07 Nov 2026 06:11 PM (IST)

    ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ హవా.. 138 MPTC స్థానాల్లో విజయం

    ఎన్టీఆర్ జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యం సాధించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం MPTC స్థానాల్లో..

    టీడీపీ – 138

    వైసీపీ – 37

    జనసేన – 15

    ఇతరుల ఖాతాలో ఒక స్థానం బీఎస్పీ చేరింది.

    ZPTC స్థానాల్లో టీడీపీ 6 స్థానాలను గెలుచుకుంది.

  • 07 Nov 2026 05:55 PM (IST)

    Gannavaram Election Result: వైసీపీ ఖాతాలో గన్నవరం

    కృష్ణా: గన్నవరం జడ్పీటీసీగా అనగాని రవి గెలుపు

    137 ఓట్లతో గెలిచిన వైసీపీ అభ్యర్థి అనగాని రవి

    వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడిగా ఉన్న అనిగాని రవి

    రీ కౌంటింగ్ నిర్వహించాలని కూటమి నేతల డిమాండ్

    కౌంటింగ్ సెంటర్ తలుపులు మూసేసిన అధికారులు

  • 07 Nov 2026 05:53 PM (IST)

    అనకాపల్లి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

    అనకాపల్లి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

    శిరసపల్లి ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం

    17 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపు

    శిరసపల్లిలో రీకౌంటింగ్ కోరిన జనసేన

    పి.ఆనందపురంలో 8 ఓట్లతో జనసేన విజయం

    రీకౌంటింగ్‌ చేయాలని వైసీపీ డిమాండ్

    ఇరువర్గాల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు

  • 07 Nov 2026 05:23 PM (IST)

    పలాస కౌంటింగ్ కేంద్రంలో అపశృతి

    శ్రీకాకుళం జిల్లా పలాస కౌంటింగ్ కేంద్రంలో అపశృతి

    బారికేడ్లు దాటుతూ కిందపడ్డ కౌంటింగ్ అసిస్టెంట్

    కిందపడటంతో కొల్లిగాంకు చెందిన కౌంటింగ్ అసిస్టెంట్ విజయ గౌరికి గాయాలు

    తీవ్రంగా గాయపడ్డ విజయ గౌరి

    చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో పలాస CHC కి తరలింపు

  • 07 Nov 2026 05:18 PM (IST)

    ఉమ్మడి కృష్ణా జిల్లా ఫలితాలు..

    ఉమ్మడి కృష్ణా జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    ఇబ్రహీంపట్నం – వెంకటేశ్వరరావు (టీడీపీ)

    గన్నవరం – రవి (వైసీపీ)

    జి.కొండూరు – రేవతి చంద్రిక (టీడీపీ)

  • 07 Nov 2026 04:51 PM (IST)

    చిన్నమండెం జెడ్పీటీసీ టీడీపీ కైవసం

    అన్నమయ్య జిల్లాలో తుది దశకు చేరుకుంటున్న కౌంటింగ్

    చిన్నమండెం జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ విజయం

    టీడీపీ అభ్యర్థి మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గెలుపు

  • 07 Nov 2026 04:49 PM (IST)

    కొల్లిపరలో వైసీపీ విజయం

    గుంటూరు జిల్లా కొల్లిపరలో వైసీపీ విజయం

    కొల్లిపర జెడ్పీటీసీ స్థానంలో160 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందిన వైసీపీ

    కొల్లిపర జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి గుది బండి సూర్యకుమారి విజయం

  • 07 Nov 2026 04:45 PM (IST)

    రైల్వేకోడూరులో ఉద్రిక్తత

    తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో ఉద్రిక్తత

    కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని వైసీపీ నిరసన

    కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కొరముట్ల శ్రీనివాసులు

    వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట

    కౌంటింగ్‌పై కోర్టును ఆశ్రయిస్తామన్న కొరముట్ల

  • 07 Nov 2026 04:40 PM (IST)

    Nallacheruvu Election Result: పరిటాల శ్రీరామ్ ఘన విజయం

    శ్రీసత్యసాయి జిల్లా ZPTC ఎన్నికలో గెలుపొందిన పరిటాల శ్రీరామ్

    నల్లచెరువు ZPTC స్థానంలో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ విజయం

    పరిటాల శ్రీరామ్ విజయంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు

  • 07 Nov 2026 04:36 PM (IST)

    ఉత్కంఠ రేపుతున్న విజయనగరం పరిషత్‌ ఫలితాలు!

    ముందంజలో చిన్న శీను కుమార్తె సిరి సహస్ర

    తెర్లాం మండల ZPTC అభ్యర్థిగా మజ్జి సిరి సహస్ర

    బొత్స ఫ్యామిలీలో కూతురు వెనుకంజ.. కోడలు ముందంజ

    గరివిడి ZPTC అభ్యర్థి బొత్స కోడలు పూజిత ముందంజ

    బొండపల్లి ZPTCఅభ్యర్థి బొత్స కుమార్తె అనూష వెనుకంజ

  • 07 Nov 2026 04:33 PM (IST)

    క్రిష్ణగిరిలో స్వతంత్ర అభ్యర్థి విజయం

    ఉమ్మడి కర్నూలు జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    క్రిష్ణగిరి జిల్లా ప్రాదేశిక స్థానంలో అనూహ్య పరిణామం

    క్రిష్ణగిరి – శ్రీరాములు (స్వతంత్ర అభ్యర్థి) విజయం

  • 07 Nov 2026 04:32 PM (IST)

    పులివెందులలో నైతిక విజయం వైసీపీదే: అవినాష్‌ రెడ్డి

    ఎన్నికల్లో అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ అవినాష్‌ రెడ్డి ఆరోపించారు. 2021లో కుప్పంలో టీడీపీ ఓడిపోయిందని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో సగానికిపైగా బూత్‌లలో రిగ్గింగ్ జరిగిందని, తప్పుడు కేసులు, దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. పులివెందులలో నైతికంగా వైసీపీదే విజయమని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

  • 07 Nov 2026 04:18 PM (IST)

    గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ లీడ్

    చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ లీడ్

    5 జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ ముందంజ

    పాలసముద్రం జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ ముందంజ

  • 07 Nov 2026 04:17 PM (IST)

    డోన్ జెడ్పీటీసీ టీడీపి కైవసం

    నంద్యాల జిల్లా డోన్ జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం

    లక్ష్మీ వేదవతి 23 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు

  • 07 Nov 2026 04:15 PM (IST)

    అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం: వాసంశెట్టి

    కౌంటింగ్ కేంద్రాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మద్దతు ఎన్డీఏ కూటమికే లభించిందన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. ఎన్నికల్లో సాధించిన విజయాలు తమ బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని మంత్రి వాసంశెట్టి వెల్లడించారు.

  • 07 Nov 2026 03:41 PM (IST)

    ఒక్క ఓటుతో టీడీపీ అభ్యర్థి గెలుపు

    పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి జెడ్పీటీసీ టీడీపీ విజయం

    టీడీపీ అభ్యర్థి కొల్లి అరుణ కుమారి ఒక ఓటుతో గెలుపు

    రికౌంటింగ్ కోరిన వైసీపీ

    రీకౌంటింగ్‌లోనూ ఒక్క ఓటు మెజార్టీ రావడంతో టీడీపీ అభ్యర్థి గెలుపు ఖరారు చేశారు అధికారులు

  • 07 Nov 2026 03:37 PM (IST)

    దెందులూరు జేడ్పీటీసీ టీడీపీ విజయం

    ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    దెందులూరు – మహేష్‌ (టీడీపీ) జేడ్పీటీసీగా విజయం

  • 07 Nov 2026 03:35 PM (IST)

    కొత్తపేటలో వైసీపీ నేతల ఆందోళన.. ఉద్రిక్తత

    అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కౌంటింగ్ కేంద్రం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రెండోసారి కేంద్రం వద్దకు రావడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను లోపలికి అనుమతించకుండా గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగుతూ గేటు బయట బైఠాయించారు.

  • 07 Nov 2026 03:34 PM (IST)

    ఆలూరులో వైసీపీ నేతల ఆందోళన

    కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ ఏజెంట్లకు అనుమతి ఇవ్వలేదంటూ ఆందోళన..

    అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే విరుపాక్షి ఆధ్వర్యంలో రోడ్డుపై ర్యాలీ

    పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే విరుపాక్షి

    కౌంటింగ్ హాల్ వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

    టీడీపీ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారంటూ ఎమ్మెల్యే విరుపాక్షి ఆవేదన

    కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసుల తీరుపై వైసీపీ నేతల నిరసన. .

  • 07 Nov 2026 03:29 PM (IST)

    ఏపీలో ప్రశాంతంగా పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

    కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం

    టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి భారతి విజయం

    1,463 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన భారతి

    ఓటమితో కౌంటింగ్‌ కేంద్రాల నుంచి వైసీపీ నేతలు

    మైదుకూరు జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

  • 07 Nov 2026 03:26 PM (IST)

    విశాఖ జిల్లాలో కూటమి హవా

    ఉమ్మడి విశాఖ జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    నర్సీపట్నం – రమణమ్మ (టీడీపీ)

    యలమంచిలి – చలపతి (జనసేన)

  • 07 Nov 2026 03:25 PM (IST)

    లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నా- జగన్‌

    వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నల్లపాడు సమీపంలో బ్యాలెట్‌ బాక్సులు ఎందుకు దింపారు? వాటికి భద్రత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. శాంతియుత ఆందోళన చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 07 Nov 2026 02:52 PM (IST)

    Vemula Election Result: వేములలో వైసీపీ విజయం

    ఉమ్మడి కడప జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    వేముల – సత్యప్రభావతి (వైసీపీ) విజయం

  • 07 Nov 2026 02:48 PM (IST)

    టీడీపీ ఖాతాలో మాచవరం, గురజాల జడ్పీటీసీలు..

    పల్నాడు జిల్లా మాచవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఘన విజయం

    సమీప ప్రత్యర్థిపై 23వేల పైచిలుకు మెజారిటీతో కత్తి సరోజిని గెలుపు

    గురజాల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఘన విజయం

    సమీప ప్రత్యర్థిపై 17 వేల పైచిలుకు మెజారిటీతో మద్దినేని లక్ష్మీ గెలుపు

    అధికారుల నుండి డిక్లరేషన్ ఫారం అందుకున్న మాచవరం, గురజాల జడ్పీటీసీలు…

  • 07 Nov 2026 02:44 PM (IST)

    పోలీసులతో వైసీపీ ఎమ్మెల్యే వాగ్వాదం

    మార్కాపురం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

    పోలీసులతో వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి వాగ్వాదం

    ఐడీ లేకుండా కేంద్రం దగ్గరికి రావొద్దన్న పోలీసులు

  • 07 Nov 2026 02:42 PM (IST)

    ఉమ్మడి గుంటూరు జిల్లాలో TDP హవా

    ఉమ్మడి గుంటూరు జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    మాచవరం – సరోజిని (టీడీపీ)

    గురజాల – లక్ష్మి (టీడీపీ)

  • 07 Nov 2026 02:39 PM (IST)

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత

    కొత్తపేట కౌంటింగ్ కేంద్రం దగ్గర వైసీపీ ఆందోళన

    మరోసారి కౌంటింగ్ కేంద్రానికి గిడ్డి సత్యనారాయణ

    ఎమ్మెల్యేను బయటకు పంపిన డీఎస్పీ మురళీమోహన్

    వైసీపీ నేతలను గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు

    పోలీసులతో వైసీపీ నేతల తీవ్ర వాగ్వాదం

  • 07 Nov 2026 02:36 PM (IST)

    ప్రత్తిపాడులో భార్యాభర్తల ఘన విజయం

    కాకినాడ జిల్లాలో ఎంపీటీసీలుగా దంపతులు విజయం సాధించారు.

    ప్రత్తిపాడు-2లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన యాళ్ల జగదీశ్ గెలుపొందారు

    ప్రత్తిపాడు-3లో టీడీపీ తరఫున జగదీశ్ సతీమణి మంగాదేవి విజయం సాధించారు

    టీడీపీ నుంచి ఎంపీటీసీలుగా పోటీ చేసిన దంపతులు
    1,336 ఓట్ల మెజార్టీతో యాళ్ల జగదీష్ గెలుపు
    1,138 ఓట్ల మెజార్టీతో యాళ్ల మంగాదేవి విజయం
  • 07 Nov 2026 02:30 PM (IST)

    ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ హవా

    ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ZPTC ఎన్నికల ఫలితాలు

    నిండ్ర – డి.వాసు(టీడీపీ)

    విజయపురం – కె.బాబు(టీడీపీ)

    నగరి – పి.రాధిక (టీడీపీ) జెడ్పీటీసీగా విజయం

  • 07 Nov 2026 02:28 PM (IST)

    మేకపాటి కుటుంబానికి సొంతూరులో బిగ్ షాక్!

    నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబానికి సొంతూరులో ఎదురుదెబ్బ

    బ్రాహ్మణపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఘన విజయం

  • 07 Nov 2026 02:16 PM (IST)

    NTR Election Results: ఎన్టీఆర్ జిల్లాలో కూటమి హవా

    పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కూటమి ఆధిక్యం

    జెడ్పీటీసీ మెయిన్ కౌంటింగ్‌లోనూ కూటమి లీడింగ్

    ఎన్టీఆర్ జిల్లాలో 16 జెడ్పీటీసీల్లో కూటమి ఆధిక్యం

    13 ZPTCల్లో టీడీపీ లీడింగ్, 2 చోట్ల జనసేన ఆధిక్యం

    ఒక జెడ్పీటీసీలో బీజేపీ లీడింగ్

    ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతున్న ఎంపీటీసీ కౌంటింగ్

    ఎంపీటీసీ కౌంటింగ్‌లో టీడీపీ ఆధిక్యం

    ఇప్పటికే టీడీపీ ఖాతాలో 20 ఎంపీటీసీలు

    నాలుగు ఎంపీటీసీలు జనసేన కైవసం

    బీజేపీ ఖాతాలో మూడు ఎంపీటీసీలు

    ఐదు ఎంపీటీసీల్లో వైసీపీ విజయం

  • 07 Nov 2026 01:39 PM (IST)

    Dhumantunigudem Election Results: ఫలితాలకు ముందే మరణం.. ఆపై జనసేన అభ్యర్థి విజయం

    ధుమంతునిగూడెం జనసేన MPTC అభ్యర్థి విజయం

    350పై ఓట్ల తేడాతో MPTCగా గారపాటి దివ్య గెలుపు

    కౌంటింగ్‌కు ముందురోజూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ దివ్య మృతి

    మరణం తర్వాత ఎన్నికల్లో MPTCగా విజయం సాధించిన దివ్వ

  • 07 Nov 2026 01:29 PM (IST)

    Election results in Vempalle: వేంపల్లెలో 9,669 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ

    వేంపల్లె ZPTC తొలి రౌండ్‌లో వైసీపీ భారీ ఆధిక్యం

    జనసేనపై 9,669 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ

    వేంపల్లెలో వైసీపీకి 11,303, జనసేనకు 1,634 ఓట్లు

  • 07 Nov 2026 01:24 PM (IST)

    Mydukur Election Results: మైదుకూరు ZPTC టీడీపీ కైవశం

    కడప జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
    మైదుకూరు ZPTC టీడీపీ కైవశం
    18,903 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ గెలుపు
  • 07 Nov 2026 01:14 PM (IST)

    Nellore Election Results: సొంతూరులో మేకపాటి కుటుంబానికి ఎదురుదెబ్బ

    నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న కౌంటింగ్

    మేకపాటి కుటుంబానికి సొంతూరులో ఎదురుదెబ్బ

    బ్రాహ్మణపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఘన విజయం

  • 07 Nov 2026 01:05 PM (IST)

    Nimmakuru Election Results: నిమ్మకూరు ఎంపీటీసీగా టిడిపి అభ్యర్థి విజయం

    పామర్రు నియోజకవర్గంలో టీడీపీ విజయం

    ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఎంపీటీసీగా టిడిపి అభ్యర్థి విజయం

    560 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన మాచర్ల కల్పన

  • 07 Nov 2026 12:48 PM (IST)

    Anantapur Election Results: అనంతపురం: దురదకుంటలో టీడీపీ అభ్యర్థి గెలుపు

    అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న కౌంటింగ్

    కళ్యాణదుర్గం మండలం దురదకుంటలో టీడీపీ అభ్యర్థి గెలుపు

    ఎంపీటీసీగా విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి లక్ష్మి

  • 07 Nov 2026 12:45 PM (IST)

    గొల్లపూడి, ఎంపీటీసి సిగ్మెంట్ 3లో నిలిచిపోయిన కౌంటింగ్

    విజయవాడ: గొల్లపూడి, ఎంపీటీసి సిగ్మెంట్ 3లో నిలిచిపోయిన కౌంటింగ్

    పివో సంతకంపై అనుమానాలు

    పివో సంతకం లేకుండా కనిపించిన బ్యాలెట్ పేపర్లు

    బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి ఉండడంపై అనుమానాలు

    కౌంటింగ్ కేంద్రం నుండి ఏజెంట్ ని బయటకి వెళ్లిపోవాలాని చెప్పిన RO

  • 07 Nov 2026 12:18 PM (IST)

    Atmakur Election Results: ఆత్మకూరు: కృష్ణాపురంలో టీడీపీ అభ్యర్థి విజయం

    నంద్యాల జిల్లా ఆత్మకూరులో కొనసాగుతున్న కౌంటింగ్

    కృష్ణాపురంలో టీడీపీ అభ్యర్థి విజయం

    223 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి ముడియాల రాజ ప్రతాప్ రెడ్డి

  • 07 Nov 2026 12:16 PM (IST)

    Mahanandi Election Results: మహానంది:సీతారాంపురము ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం

    నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    మహానంది మండలం సీతారాంపురము ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం

    వైసీపీ అభ్యర్థి నులి వెంకటేశ్వర్లుపై 700 భారీ మెజారిటీతో గెలుపు

  • 07 Nov 2026 12:14 PM (IST)

    Vemulakota Election Results: వేములకోటలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి విజయం

    మార్కాపురం జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    వేములకోటలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి మాదిరెడ్డి భారతి విజయం

    32 ఓట్ల తేడాతో విజయం సాధించిన మాదిరెడ్డి భారతి

  • 07 Nov 2026 12:12 PM (IST)

    Kalyandurg Election Results: కళ్యాణదుర్గం: చాపిరిలో టీడీపీ ZPTC అభ్యర్థి విజయం

    అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    కళ్యాణదుర్గం మండలం చాపిరిలో TDP MPTC అభ్యర్థి విజయం

    టీడీపీ నుంచి MPTCగా విజయం సాధించిన హనుమంతు

  • 07 Nov 2026 12:05 PM (IST)

    Pulivendula Election Results: పులివెందులో టీడీపీ ZPTC అభ్యర్థి విజయం

    కడపలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    పులివెందులో టీడీపీ ZPTC అభ్యర్థి విజయం

    1,463 మెజార్టీతో విజయం సాధించిన టిడిపి అభ్యర్ది

  • 07 Nov 2026 11:55 AM (IST)

    Anantapur Counting: అనంతపురం: చీకట్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    జిల్లాలోని పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం

    కల్యాణదుర్గం కౌంటింగ్‌ కేంద్రంలో పవర్ కట్

    SVGM డిగ్రీ కాలేజ్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

    రాయదుర్గం, డి.హీరేహాల్, బొమ్మనహాల్ కనేకల్లు కేంద్రాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా

    చీకట్లోనే ఓట్ల లెక్కింపు చేస్తున్న అధికారులు

  • 07 Nov 2026 11:50 AM (IST)

    Pedana ZPTC Results :పెడన ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ లీడ్

    పెడన నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    పెడన మండలంలో లీడ్‌లో కొనసాగుతున్న టీడీపీ

    టీడీపీ 49; వైసీపీ- 29; నోటా- 1; చెల్లనివి – 15

    బంటుమిల్లి మండలంలో లీడ్‌లో ఉన్న టీడీపీ అభ్యర్థి

    టీడీపీ- 119; వైసీపీ- 39; కాంగ్రెస్‌- 3; చెల్లనివి- 1

    కృత్తివెన్ను మండలంలో లీడ్‌లో ఉన్న టీడీపీ అభ్యర్థి

    టీడీపీ 57; వైసీపీ- 47 ఓట్లు

    గూడూరులోనూ లీడ్‌లో కొనసాగుతున్న టీడీపీ

    టీడీపీ- 69; వైసీపీ- 31; కాంగ్రెస్‌- 1; నోటా-4

  • 07 Nov 2026 11:28 AM (IST)

    AP MPTC, ZPTC Polls Result: ఏపీలో కొనసాగుతున్న పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్

    స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు

    ఇప్పటికే ఏకగ్రీవాల్లో కూటమే ఆధిక్యం

    కౌంటింగ్‌లోనూ కూటమి పార్టీల జోరు

    అన్ని జిల్లాల్లోనూ కూటమికి స్పష్టమైన ఆధిక్యత

    పోటీ ఇవ్వలేకపోతున్న వైసీపీ

    ZPTC: కూటమి 206 స్థానాల్లో ఆధిక్యం

    ZPTC: వైసీపీ 14 స్థానాల్లో ఆధిక్యం

    MPTC: కూటమి 1992, వైసీపీ 99 స్థానాల్లో ఆధిక్యం

    మెజార్టీ ZPలు, MPPలు గెల్చుకునే దిశగా కూటమి

    విజయనగరంలో ZPల్లో టీడీపీ-1, వైసీపీ-3 చోట్ల ఆధిక్యం

    కూటమికి గట్టిపోటీ ఇస్తున్న బొత్స కుటుంబం

  • 07 Nov 2026 11:22 AM (IST)

    Kakinada Counting: కాకినాడ కౌంటింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్తత

    కాకినాడలో ZP సీఈవో, ఆర్డీవో మధ్య వాగ్వాదం

    జెడ్పీ సీఈవోను ప్రశ్నించిన ఆర్డీవో మల్లిబాబు

    ఏజెంట్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం

  • 07 Nov 2026 11:17 AM (IST)

    Srikakulam Election Result: సరుబుజ్జిలి ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో YCP ఆధిక్యం

    శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    సరుబుజ్జిలి ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో YCP ఆధిక్యం

    సరుబుజ్జిలి పోలైన మొత్తం 9 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

    5 ఓట్లతో ఆధిక్యంలో ఉన్న వైసీపీ అభ్యర్థి

    జనసేన 2, చెల్లని ఓట్లు 2

  • 07 Nov 2026 11:14 AM (IST)

    Gannavaram election result:అజ్జంపూడిలో వైసీపీ MPTC అభ్యర్థి తొలి విజయం

    గన్నవరంలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    అజ్జంపూడిలో వైసీపీ MPTC అభ్యర్థి తొలి విజయం

    బీజేపీ అభ్యర్థి అమృతల ప్రసాద్‌పై YCP అభ్యర్థి ఈదులమూడి విజయ్ విజయం

  • 07 Nov 2026 11:11 AM (IST)

    Anantagiri Result: అనంతగిరిలో వైసీపీ ZPTC అభ్యర్థి ముందంజ

    అల్లూరి జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    అనంతగిరి ZPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అధిక్యం

    అనంతగిరిలో పోలైన మొత్తం పోస్టల్ ఓట్లు 46

    21 ఓట్లతో లీడ్‌తో కొనసాగుతున్న వైసీపీ

    13 ఓట్లతో కొనసాగుతున్న టీడీపీ అభ్యర్థులు

  • 07 Nov 2026 11:07 AM (IST)

    Eluru Result: ఏలూరు జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా

    ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    బీమడోలు, నీడమర్రులో జనసేన అభ్యర్థుల ముందంజ

    దెందులూరు, ద్వారకాతిరుమలలో టీడీపీ అభ్యర్థుల లీడ్

    ZPTC కౌటింగ్‌లో లీడ్‌లో కొనసాగుతున్న కూటమి అభ్యర్థులు

  • 07 Nov 2026 10:57 AM (IST)

    Guntur Counting: గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి SEC పునేఠా

    గుంటూరులో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పరిశీలన

    సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు

    సీసీ ఫుటేజ్‌ను 60 రోజులపాటు భద్రపరుస్తాం-SEC

    కోర్టు కేసులు ఉంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంచుతాం

    సా.4గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం

    త్వరలో 13 వేల గ్రామ పంచాయతీలు ఎన్నికలు-SEC

  • 07 Nov 2026 10:50 AM (IST)

    Penukonda Counting: పెనుకొండ కౌంటింగ్‌ కేంద్రంలో ఇబ్బందులు

    పెనుకొండ కౌంటింగ్‌ కేంద్రంలో సిబ్బందికి ఇబ్బందులు

    కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు

    అధికారుల తీరుపై ఆర్డీవో ఆగ్రహం

  • 07 Nov 2026 10:46 AM (IST)

    Kakinada Counting: కాకినాడ కౌంటింగ్‌ కేంద్రం దగ్గర టెన్షన్

    కౌంటింగ్‌ కేంద్రం దగ్గర అభ్యర్థులు, ఏజెంట్ల ఆందోళన

    ఏజెంట్లను లోపలికి పంపడంలేదని నిరసన

    కలెక్టర్‌ను చుట్టుముట్టిన అభ్యర్థులు, ఏజెంట్లు

    తాగునీరు, సదుపాయాలు కల్పించలేదని నిరసన

  • 07 Nov 2026 10:45 AM (IST)

    Chittoor Counting: నిండ్రలో ఓట్ల లెక్కింపు ఆలస్యం

    చిత్తూరు: నిండ్రలో ఓట్ల లెక్కింపు ఆలస్యం

    బ్యాలెట్ బాక్స్‌కు వేసిన తాళాలు మిస్సింగ్

    తాళాలు కనబడక కౌంటింగ్ ఆలస్యం

  • 07 Nov 2026 10:36 AM (IST)

    AP MPTC, ZPTC Polls Result: పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి పార్టీల దూకుడు

    ఏపీలో కొనసాగుతున్న పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్

    స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు

    ZPTC: కూటమి 150 స్థానాల్లో ఆధిక్యం

    ZPTC: వైసీపీ 13 స్థానాల్లో ఆధిక్యం

    MPTC: కూటమి 1958, వైసీపీ 98 స్థానాల్లో ఆధిక్యం

    ఎన్నికల కౌంటింగ్‌ లైవ్‌ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..

  • 07 Nov 2026 10:32 AM (IST)

    Devarapalli Counting: దేవరపల్లిలో టీడీపీ ZPTC అభ్యర్థి లీడ్

    తూ.గో. జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల తెక్కింపు

    దేవరపల్లి మండలం జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ టీడీపీ లీడ్

    దేవరపల్లి మండలంలో మొత్తం 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

    టీడీపీ 134, వైసిపి 49 , కాంగ్రెస్ 2 , నోటా 1 ,ఇన్వాలిడ్ 3

  • 07 Nov 2026 10:29 AM (IST)

    Garividi Counting: గరివిడిలో YCP ZPTC అభ్యర్థి బొత్స పూజిత లీడ్‌

    విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    గరివిడి జడ్పీటీసీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీ లీడ్

    కిమిడి సంధ్యపై బొత్స కోడలు బొత్స పూజిత పది ఓట్ల ఆధిక్యం

  • 07 Nov 2026 10:25 AM (IST)

    Chunduru Counting: చుండూరు ZPTC, MPTC పోస్టల్ ఓట్లలో వైసీపీ ఆధిక్యం.

    బాపట్ల జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    చుండూరు జడ్పీటీసీ, ఎంపీటీసి పోస్టల్ ఓట్లలో వైసీపీ ఆధిక్యం.

    చుండూరు జడ్పీటీసీలో మొత్తం 88 పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు

    టీడీపీ- 43, వైసీపీ- 44 , నోటా- 1

    చుండూరు ఎంపీటీసితో మొత్తం 88 పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు

    టీడీపీ- 32, వైసీపీ-48, జనసేన- 7, చెల్లని ఓట్లు- 1

  • 07 Nov 2026 10:18 AM (IST)

    Tiruvuru MPTC Counting: తిరువూరులో టీడీపీ అభ్యర్థి లీడ్

    ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కొనసాగుతున్న MPTC కౌంటింగ్

    ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం

    తిరువూరులో మొత్తం 96 ఓట్లు పోస్టల్ బ్యాలట్ ఓట్లు

    57 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్న టీడీపీ అభ్యర్థి

    39 ఓట్లుతో కొనసాగుతున్న వైసీపీ అభ్యర్థి

  • 07 Nov 2026 10:15 AM (IST)

    Jaggayyapeta MPTC Counting: జగ్గయ్యపేటలో టీడీపీ MPTC అభ్యర్థి ముందంజ

    ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొనసాగుతున్న కౌంటింగ్

    ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ముందంట

    జగ్గయ్యపేటలో మొత్తం 130 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

    73 ఓట్లతో లీడ్‌తో కొనసాగుతున్న టీడీపీ అభ్యర్థి

    జనసేన:11 వైసీపీ: 44 కాంగ్రెస్: 0, సీపీఎం :01 , స్వతంత్రులు: 0, ఇన్వాలేడ్ : 1

  • 07 Nov 2026 10:11 AM (IST)

    Narasaraopet Counting: నరసరావుపేటలోని కౌంటింగ్ సెంటర్‌లో ఆసక్తికర సన్నివేశం

    AMరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ సెంటర్‌లోని బ్యాలెట్ బాక్సుల్లో కరపత్రాలు

    ఓట్లతో పాటు కరపత్రాలు బాక్స్‌లో వేసిన ఓటర్లు

    సత్తెనపల్లి మండలం కంకాలపల్లి ఓటర్లు వేసినట్లుగా గుర్తింపు

    ఊరిలోని సమస్యలు పరిష్కరించాలని పాంప్లెట్స్‌లో ఏకరువు

    గ్రామానికి సమీపంలో నిర్మిస్తున్న U ఆకారంలో ROB వద్దని విన్నపం

    U ఆకారంలో అండర్‌పాస్ వల్ల స్థానికంగా ఉత్పన్నమయ్యే సమస్యల ప్రస్తావన

    సీఎం, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకుని ప్రధాన రహదారికి బ్రిడ్జ్‌ని లింక్ చేయాలని విన్నపం

  • 07 Nov 2026 10:05 AM (IST)

    Nallacheruvu ZPTC Counting: నల్లచెరువులో టీడీపీ ZPTC అభ్యర్థి పరిటాల శ్రీరామ్ లీడ్

    శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువులో కొనసాగుతున్న కౌంటింగ్

    పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ ZPTC అభ్యర్థి పరిటాల శ్రీరామ్ లీడ్

    63 ఓట్లతో లీడ్‌లో ఉన్న టిడిపి అభ్యర్థి పరిటాల శ్రీరామ్

    వైసీపీ అభ్యర్థి రవికుమార్ రెడ్డికి 43 ఓట్లు

    కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

  • 07 Nov 2026 10:00 AM (IST)

    Alur Counting:ఆలూరు కౌంటింగ్ కేంద్రం దగ్గర టెన్షన్ టెన్షన్

    కర్నూలు: ఆలూరు కౌంటింగ్ కేంద్రం దగ్గర టెన్షన్

    పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌

    ఇద్దరు YCP ఏజెంట్లకు స్వల్ప గాయాలు

    ఒక పార్టీ నుంచి ఒక ఏజెంట్‌కే అనుమతి అంటూ అధికారుల నిబంధన

    అధికారుల నిబంధనపై రాజకీయ పార్టీల అభ్యంతరం

    ఇద్దరు ఏజెంట్‌లకు పాసు జారీ చేసి ఒకరికే అనుమతివ్వడంపై ఆగ్రహం

    పాసులు జారీ చేసి అనుమతి నిరాకరించడంపై పార్టీల నాయకుల ఆందోళన

  • 07 Nov 2026 09:57 AM (IST)

    Anantapur Counting: అనంతపురంలో టెన్షన్ పుట్టిస్తున్న ఆత్మకూరు ZPTC కౌంటింగ్

    • YCP అభ్యర్థి భారతి తరపున పోలింగ్ ఏజెంట్‌గా వచ్చిన తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి భార్య నయనతా రెడ్డి
    • TDP అభ్యర్థి తరుపన కౌంటింగ్‌ ఏజెంట్‌గా పరిటాల సునీత సోదరుడు మురళి
    • ఈ ఇద్దరి రాకతో అలర్ట్ అయిన పోలీసులు
    • కౌంటింగ్ కేంద్రం దగ్గరకు చేరుకున్న అడిషనల్ SP నాగభూషణం

    అంతకు ముందు YCP అభ్యర్థి తరపున రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వస్తారన్న సమాచారంతో పోలీసులను అలర్ట్ చేశారు ఎమ్మెల్యే పరిటాల సునీత. కౌంటింగ్ హాల్‌లో కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటూ ఎస్పీ జగదీష్‌కి వివరించారు. చివరకు YCP తరుపన రాజశేఖర్ రెడ్డి భార్య నయనతా రెడ్డి, టీడీపీ తరపున సునీత సోదరుడు మురళి కౌంటింగ్ ఏజెంట్‌గా లోపలకు వెళ్లారు

  • 07 Nov 2026 09:39 AM (IST)

    Atmakur Counting: ఆత్మకూరు ZPTC కౌంటింగ్‌తో అనంతపురంలో ఉత్కంఠ

    అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న కౌంటింగ్

    ఆత్మకూరు ZPTC కౌంటింగ్‌తో అనంతపురంలో ఉత్కంఠ

    ఆత్మకూరు కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసుల అప్రమత్తత

    కౌంటింగ్ ఏజెంట్ల రాకతో అలర్ట్ అయిన పోలీసులు

    వైసీపీ అభ్యర్థి భారతి తరపున తోపుదుర్తి నయనతారెడ్డి

    ఏజెంట్‌గా వచ్చిన పరిటాల సునీత సోదరుడు మురళి

  • 07 Nov 2026 09:38 AM (IST)

    Tiruvuru Counting: ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతున్న కౌంటింగ్

    తిరువూరు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం

    57 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్న టీడీపీ

    39 ఓట్లుతో కొనసాగుతున్న వైసీపీ

  • 07 Nov 2026 09:22 AM (IST)

    Nellore Election Counting: దత్తలూరు ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

    నెల్లూరు: దత్తలూరు ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

    చర్లపాడు ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

    చిల్లకూరు ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

    చిల్లకూరు ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

    తిరువూరు ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

    కుంభం MPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

    బేస్తవారిపేట MPTC పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం

    ఎన్టీఆర్ జిల్లాలోని మూడు ZPTC స్థానాల్లో కూటమి ఆధిక్యం

  • 07 Nov 2026 09:06 AM (IST)

    కడప జిల్లాలో 23 జడ్పీటీసీలు ఏకగ్రీవం

    జిల్లా వ్యాప్తంగా 39 జడ్పీటీసీ స్థానాలు..

    23 స్థానాలు ఏకగ్రీవం, 16 స్థానాలకు జరిగిన ఎన్నికలు

    నెల్లూరు జిల్లాలో 35 జడ్పీటీసీ స్థానాలకు 5 ఏకగ్రీవం

    30 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలు

  • 07 Nov 2026 09:04 AM (IST)

    కర్నూలు: ఆలూరు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత

    కౌంటింగ్ కేంద్రం దగ్గర ఇరువర్గాలపై లాఠీఛార్జ్
    ఇద్దరు వైసీపీ ఏజెంట్లకు గాయాలు
    ఏజెంట్ల అనుమతిపై పార్టీల నాయకుల అభ్యంతరం
    ఒక్క ఏజెంట్‌కే అనుమతిపై పార్టీల ఆగ్రహం
    పాసులు ఇచ్చి అనుమతి నిరాకరించడంపై ఆందోళన
  • 07 Nov 2026 09:02 AM (IST)

    కర్నూలులో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    సి.బెళగల్ ZPTC పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు
    వైసీపీ-18, టీడీపీ-14, ఇండిపెండెంట్-1 ఓట్లు
  • 07 Nov 2026 09:00 AM (IST)

    Pulivendula Counting: పులివెందులలో వైసీపీ ఆధిక్యం

    పులివెందుల ZPTC పోస్టల్ బ్యాలెట్‌లో YCP ఆధిక్యం
    పులివెందుల పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీకి 3 ఓట్లు
    టీడీపీకి 1, ఇండిపెండెంట్లకు 2 ఓట్లు
  • 07 Nov 2026 08:57 AM (IST)

    Anantapur Counting:అనంతపురం కౌంటింగ్ హాల్ దగ్గర హైఅలర్ట్

    YCP కౌంటింగ్ ఏజెంట్లుగా తోపుదుర్తి సోదరులు
    YCP ఏజెంట్లపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిటాల సునీత
    కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదు
    కౌంటింగ్ హాల్ దగ్గర పోలీసుల అలర్ట్
  • 07 Nov 2026 08:50 AM (IST)

    ఆళ్లగడ్డలో కార్లను దగ్ధం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

    YCP నేత ANR మహబూబ్ బాషా ఇంటి బయట ఉన్న మూడు కార్లు దగ్ధం

    పూర్తిగా కాలిపోయిన రెండు కార్లు, ఓ ద్విచక్ర వాహనం

    సగభాగానికి పైగా దెబ్బతిన్న మరో కారు

    పరిషత్ ఎన్నికల కౌంటింగ్ వేళ కార్లను దగ్ధం చేయడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత

    2 రోజుల క్రితం మహబూబ్ బాషా కుమారుడు సాదిక్‌పై కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు

    సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

  • 07 Nov 2026 08:01 AM (IST)

    Counting begins: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

    తొలుత పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు

    365 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

    కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత

    ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

    ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు

    బ్యాలెట్ బాక్సుల్లోని గులాబీ రంగు పేపర్లు MPTC ఓట్లుగా గుర్తింపు

    తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ZPTC ఓట్లుగా గుర్తింపు

  • 07 Nov 2026 07:38 AM (IST)

    తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం

    దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య మృతి

    కౌంటింగ్ ముందే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు

    గ్యాస్ నొప్పి కింద వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి

  • 07 Nov 2026 07:08 AM (IST)

    రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన ZPTC, MPTC స్థానాలు ఇవే

    రాష్ట్రవ్యాప్తంగా 77 ZPTC స్థానాలు ఏకగ్రీవం

    2,051 MPTC స్థానాలు ఏకగ్రీవం

    మిగిలిన 577 ZPTC, 7,707 MPTC స్థానాలకు నవంబర్ 5న పోలింగ్

    నవంబర్ 5న జరిగిన పోలింగ్‌లో 70.72 శాతం ఓటింగ్ నమోదు

    2021 ఎన్నికల్లో 60.91 శాతం పోలింగ్

    గత ఎన్నికలతో పోలిస్తే 9.81 శాతం పెరిగిన పోలింగ్

    7 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 6న రీపోలింగ్

    రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్ల మధ్య నేడు ఫలితాల వెల్లడి

  • 07 Nov 2026 07:07 AM (IST)

    ఓట్ల లెక్కింపు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత

    కౌంటింగ్ హాళ్ల పరిమాణాన్ని బట్టి టేబుళ్ల సంఖ్య పెంచుకునే అవకాశం

    రాష్ట్రవ్యాప్తంగా 19,885 మంది పోలీసులతో మూడంచెల భద్రత

    135 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలతో భద్రతా ఏర్పాట్లు

    572 మంది సీఐలు, ఆర్‌ఐలు, 1,412 మంది ఎస్ఐల నియామకం

    3,996 మంది ఏఆర్ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ల మోహరింపు

    10,881 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 2,889 మంది హోంగార్డులతో బందోబస్తు

    సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా

    పోలీసుల బాడీ వోర్న్ కెమెరాలతోనూ పర్యవేక్షణ

    అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

    కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు

  • 07 Nov 2026 06:59 AM (IST)

    AP MPTC, ZPTC Polls Result: కాసేపట్లో ఏపీలో MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు

    రాష్ట్రవ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

    మొత్తం 9,062 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్ల లెక్కింపు

    కౌంటింగ్ విధుల్లో 11,002 మంది సూపర్‌వైజర్లు

    28,692 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, సిబ్బంది నియామకం

    ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

    ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు

    బ్యాలెట్ బాక్సుల్లోని గులాబీ రంగు పేపర్లు MPTC ఓట్లుగా గుర్తింపు

    తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ZPTC ఓట్లుగా గుర్తింపు

    MPTC, ZPTC బ్యాలెట్ పేపర్లను వేర్వేరుగా 25 చొప్పున కట్టలుగా ఏర్పాటు

    ప్రతి కౌంటింగ్ టేబుల్‌కు ఒక్కో రౌండ్‌లో 1,000 బ్యాలెట్ పేపర్లు

    50 శాతం టేబుళ్లపై ZPTC ఓట్ల లెక్కింపు

    మిగిలిన 50 శాతం టేబుళ్లపై MPTC ఓట్ల లెక్కింపు

    ఒక MPTC లెక్కింపు పూర్తయ్యాక రిటర్నింగ్ అధికారి పరిశీలన, ఆమోదం

    ZPTC ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఫలితాల ప్రకటన

Published On - Nov 07,2026 6:54 AM

Follow Us