కల్కి 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ నుంచి ఆమె షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ, సాయి పల్లవి పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ కూడా అక్టోబర్ నుండి డేట్స్ కేటాయించారు.