విశాఖపట్నం, గోపాలపట్నం, కొత్తపాలెంలోని ఒక ఇంట్లో ఆరు అడుగుల భారీ నాగుపాము సంచరించి భయాందోళనలు సృష్టించింది. ఇంటి యజమాని సమాచారం మేరకు పెందుర్తికి చెందిన మేడుకుండిరి సునీల్ అండ్ టీమ్ వెంటనే చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.