AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు భారీ నష్టం..!

ఇంట్లో చెట్లు, మొక్కలు నాటడంపై వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రత్యేక నియమాలు ఉన్నాయి. హిందూ ధర్మంలో అరటి చెట్టును శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కొలువుండే పవిత్రమైన చెట్టుగా పూజిస్తారు. అరటి చెట్టును ఇంట్లో పెంచడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగి, కుటుంబంలో శాంతి, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఈ చెట్టును ఇంటి ముందు కాకుండా పెరట్లో నిర్ధేశించిన దిశలలో మాత్రమే నాటాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అరటి చెట్టును పెంచేందుకు సరైన దిశ, వాస్తు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు భారీ నష్టం..!
Banana Tree VastuImage Credit source: AI image
Jyothi Gadda
|

Updated on: Aug 13, 2026 | 6:01 PM

Share

మన ఇంట్లో నాటే కొన్ని మొక్కలు శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని ప్రతికూల ప్రభావాలను చూపుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అందులో భాగంగా అరటి చెట్టును ఇంట్లో పెంచవచ్చా? పెంచితే ఏ దిశలో నాటాలి? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. హిందూ విశ్వాసాల ప్రకారం అరటి చెట్టు అత్యంత పవిత్రమైనది. అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి నివాసం ఉంటారని, దీనిని పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు.

అరటి చెట్టుతో కలిగే శుభ ఫలితాలు:

జ్యోతిష్య శాస్త్రంలో అరటి చెట్టును గురు గ్రహానికి సంకేతంగా భావిస్తారు. జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నవారు నిత్యం అరటి చెట్టుకు నీరు పోసి పూజించడం వల్ల గురు దోషాలు తొలగిపోతాయి. అరటి చెట్టు ఉన్న ఇంట్లో సానుకూల శక్తి ప్రసరించి, ధనం, ధాన్యం, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాకుండా, విద్యార్థులకు ఉన్నత విద్య, జ్ఞానం లభించడంలో ఈ పవిత్ర వృక్షం సహాయపడుతుంది.

వివాహ యోగం, సంతాన ప్రాప్తి:

వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు అరటి చెట్టును క్రమం తప్పకుండా పూజించడం వల్ల త్వరలోనే పెళ్లి యోగం పడుతుందని నమ్ముతారు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలిగిపోయి, వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. మంచి సంతానం కోరుకునే దంపతులకు కూడా అరటి చెట్టు పూజ దివ్యౌషధంలా పనిచేస్తుందని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తు నియమాలు – ఏ దిశలో నాటాలి?:

అరటి చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముందు భాగంలో నాటకూడదు. దీనిని ఇంటి ఆవరణలో కాకుండా పెరట్లో మాత్రమే పెంచాలి.

సరైన దిశ: అరటి మొక్కను ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే నాటాలి.

నిషిద్ధ దిశ: దక్షిణ, పడమర దిశలలో అరటి చెట్టును నాటడం వాస్తు ప్రకారం శుభకరం కాదు.

అరటి చెట్టు తన జీవితకాలంలో ఒకే గెలను, ఒక పిల్ల మొక్కను ఇచ్చి అంతమవుతుంది కాబట్టి, దానిని పెరట్లోనే ఉంచి పూజించడం ఆచారం. వాస్తు నియమాలను పాటిస్తూ అరటి చెట్టును సరైన దిశలో నాటి పూజించడం ద్వారా మీ ఇంటికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల పరిపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ప్రధానంగా వాస్తు, సంప్రదాయ విశ్వాసాల ఆధారిత సూచనలు మాత్రమే. ఆరోగ్యం లేదా ఆర్థిక ప్రయోజనాలకు శాస్త్రీయ హామీగా పరిగణించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి
ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి
కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే..
కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే..
ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు
ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. 'టాక్సిక్‌'పై హీరోయిన్ విమర్శలు
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. 'టాక్సిక్‌'పై హీరోయిన్ విమర్శలు
టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పీడ్‌స్టర్
టెస్టుల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆసీస్ స్పీడ్‌స్టర్
వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి? అద్భుతమైన ఆరోగ్యం
వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి? అద్భుతమైన ఆరోగ్యం
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ కీలక నిర్ణయం..!
వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ కీలక నిర్ణయం..!
ఆఫ్ఘన్ క్రికెటర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఆఫ్ఘన్ క్రికెటర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన బిగ్ బాస్ బ్యూటీ
కుక్కర్ మూతతో కొట్టి.. బాత్‌టబ్‌లో ముంచి.. ఈ నీచుడు దారుణం..
కుక్కర్ మూతతో కొట్టి.. బాత్‌టబ్‌లో ముంచి.. ఈ నీచుడు దారుణం..
బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు
బీసీ మహిళలకు గుడ్ న్యూస్.. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు