AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు శాస్త్రం

వాస్తు శాస్త్రం

వాస్తు శాస్త్రం (Vastu Shastra) అంటే భారతీయ సంప్రదాయ నిర్మాణ శాస్త్రం. ఇల్లు, కార్యాలయం, దేవాలయం వంటి నిర్మాణాలను పంచభూతాలు, అష్ట దిక్కుల ప్రభావానికి అనుగుణంగా రూపొందించేలా వాస్తు శాస్త్రం నిర్దేశిస్తుంది. అంటే, మనం నివసించే స్థలాన్ని సానుకూల శక్తులతో సమతుల్యం చేయడం వాస్తు శాస్త్రం లక్ష్యం. వాస్తు శాస్త్రం మేరకు పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం మధ్య సమతుల్యం ఉంటే శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. అలాగే నలు దిక్కులైన తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిశకు ప్రత్యేక శక్తి ఉంటుంది. దీన్ని లోతుగా విశ్లేషించి శుభాలు కలిగేలా నిర్మాణాలు చేపట్టడం వాస్తు శాస్త్రం విశ్లేషిస్తుంది.

మంచి వాస్తు కోసం ఇంటి ప్రధాన ద్వారా తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. వంటగది ఆగ్నేయ దిశలో, పూజ గది ఈశాన్యం, పడక గది నైరుతి, నీటి ట్యాంక్ ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండాలి. మరుగుదొడ్లు ఈశాన్యంలో ఉండకూడదు. అలాగే ఇంటికి ప్రధాన ద్వారం ఎదుట చెట్లు లేదా స్తంభాలు ఉండకూడదు. వాస్తు బాగుంటే ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో సంతోషం, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ఒక సంప్రదాయ నమ్మకం మాత్రమే.. ఇది శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ప్రజలు నమ్మకంతో తమ జీవన శైలిలో భాగంగా వాస్తును పాటిస్తారు.

ఇంకా చదవండి

Vastu Tips: ఇంట్లో ఎక్కడ దీపం వెలిగించకూడదు? ఈ తప్పులు చేయకండి.. వాస్తు నియమాలివే!

Diya Lighting Rules Telugu: వాస్తు శాస్త్ర విశ్వాసాల ప్రకారం ఇంట్లో దీపం వెలిగించే ప్రదేశం, జ్వాల దిశకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొన్ని ప్రదేశాల్లో దీపం వెలిగించకూడదని చెబుతారు. ఇంట్లో ఎక్కడ దీపం పెట్టకూడదో, ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

ఇంట్లో వెండి నెమలి పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆర్థిక సమస్యలు తొలగి శుభం కలుగుతుందట!

Silver Peacock Vastu Tips Telugu: వాస్తు శాస్త్రం, మత విశ్వాసాల ప్రకారం వెండి నెమలిని ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. సరైన ప్రదేశంలో ఉంచితే ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం, వైవాహిక అనుబంధం పెరుగుతాయని నమ్మకం. ఈ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో ఈ పనులు చేస్తున్నారా? అశుభమట.. తప్పక తెలుసుకోండి!

Vastu Tips for Home Telugu: ఇంట్లో ప్రశాంతత, సానుకూల వాతావరణం కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రధాన ద్వారం, అద్దం, నిద్రించే దిశ, గణేశుడి విగ్రహం వంటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Vastu: ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దేవుళ్ల ఫొటోలు అస్సలు పెట్టకండి.. వినాయకుడి చిత్రం ఎందుకు మంచిదంటే?

God Photo Vastu for Main Door Telugu: ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేవుళ్ల చిత్రాలు లేదా విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ముందు కొన్ని వాస్తు నమ్మకాలను పాటిస్తారు. గణేశుడి చిత్రాన్ని ఎందుకు శుభప్రదంగా భావిస్తారు? శివుడి ఉగ్రరూపం, శనిదేవుడు, కాళీమాత చిత్రాలను ఎందుకు ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడదని చెబుతారు? పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయట!

Pitra Dosha Remedies Telugu: పితృ దోషం కారణంగా కుటుంబంలో సమస్యలు ఎదురవుతున్నాయని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో గోసేవ, రావి చెట్టుకు ప్రదక్షిణ, తులసి దగ్గర దీపం వంటి కొన్ని సంప్రదాయ పరిహారాలను పాటిస్తారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Vastu Tips: జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? వాస్తు ప్రకారం ఈ సంకేతాలను తెలుసుకోండి!

Jade Plant Benefits Vastu Telugu: ఇంట్లో జేడ్ ప్లాంట్ ఆకులు అకస్మాత్తుగా పసుపు రంగులోకి మారుతున్నాయా? వాస్తు, ఫెంగ్‌షుయ్ ప్రకారం దీనికి కొన్ని ప్రత్యేక సంకేతాలు ఉన్నాయని నమ్ముతారు. అలాగే మొక్క ఆకులు పసుపు రంగులోకి మారడానికి సహజ కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.

గణపతి నిమజ్జనానికి ముందు ఇంట్లో ఈ 4 వస్తువులు ఉండకూడదట.. వాస్తు ప్రకారం దోషమట!

Ganesh Visarjan Rules Telugu: గణపతి నిమజ్జనానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. వాస్తు, మత విశ్వాసాల ప్రకారం ఇంట్లోని కొన్ని పాడైపోయిన లేదా చాలాకాలంగా ఉపయోగించని వస్తువులను తొలగించడం మంచిదట. నిమజ్జనానికి ముందు ఏ 4 వస్తువులను ఇంటి నుంచి తొలగించాలో తెలుసుకోండి.

Vastu Tips: పుట్టింటి నుంచి కూతురికి ఈ 5 వస్తువులు ఇవ్వకూడదట.. ఎందుకో తెలుసా?

Vastu Tips: వాస్తు నమ్మకాల ప్రకారం పుట్టింటి నుంచి కూతురికి కొన్ని వస్తువులు ఇవ్వడం మంచిది కాదట. కత్తి, కత్తెర, గ్యాస్ స్టవ్, పుల్లటి ఊరగాయలు, కాక్టస్, నల్లని దుస్తులను ఎందుకు నివారించాలి? ఇవి తల్లి-కూతుళ్ల బంధంపై ఎలాంటి ప్రభావం చూపుతాయని నమ్ముతారో తెలుసుకోండి.

Vastu Tips: భార్యాభర్తలు ఇలా నిద్రిస్తే బంధం బలపడుతుందట.. ఈ దిశలో పడుకోవడం మంచిదట!

Husband Wife Sleeping Position Vastu: ధర్మశాస్త్రాలు, వాస్తు సంప్రదాయాల ప్రకారం భార్యాభర్తలు నిద్రించే విధానానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయని నమ్ముతారు. భార్య భర్తకు ఏ వైపు నిద్రించాలి? దంపతుల బంధం కోసం ఎలాంటి సూచనలు పాటించాలి? నిద్రించే సమయంలో తల ఏ దిశలో ఉండాలి? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

Vastu Tips: ఇంట్లో సిరిసంపదల కోసం ఈ 5 వస్తువులు ఉండాలంట! అవేంటో తెలుసా?

Vastu Tips Telugu: ఇంట్లో శాంతి, సంతోషం, సంపద, శ్రేయస్సు ఉండాలని కోరుకుంటున్నారా? వాస్తు విశ్వాసాల ప్రకారం వెండి నాణెం, గులాబీ మొక్క, లోహపు తాబేలు, పసుపు గడ్డ, గవ్వలు వంటి 5 వస్తువులను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips: అద్దె ఇంట్లో వాస్తు దోషం ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట!

Vastu Tips for Rental House Telugu: అద్దె ఇంటి నిర్మాణంలో మార్పులు చేయడం సాధ్యం కాకపోయినా, కొన్ని సులభమైన వాస్తు చిట్కాలను పాటించవచ్చని నమ్ముతారు. ఇంట్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చూడటం, పరిశుభ్రత, ఉప్పుతో చేసే పరిహారాలు, దీపం లేదా ధూపం వెలిగించడం, మొక్కలను పెంచడం వంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెట్టుకోవచ్చా? శుభమా.. అశుభమా తెలుసుకోండి!

Artificial Plants Vastu Tips Telugu: వాస్తు ప్రకారం ఇంట్లో కృత్రిమ మొక్కలను అలంకరణ కోసం ఉంచుకోవచ్చు. అయితే వాటిని సరైన ప్రదేశంలో, శుభ్రంగా ఉంచడం ముఖ్యమని భావిస్తారు. పూజ గది, పడకగది, ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి మొక్కలు ఉంచాలి? దుమ్ము పట్టిన లేదా పాడైన కృత్రిమ మొక్కలను ఎందుకు తొలగించాలి? తెలుసుకుందాం.