AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట!

New House Vastu Tips Telugu:కొత్త ఇల్లు కొనుగోలు చేశారా? గృహప్రవేశానికి ముందు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయాలని పెద్దలు సూచిస్తారు. వెండి వస్తువు ఉంచడం నుంచి అన్నదానం వరకు.. కొత్త ఇంట్లో సుఖశాంతులు, సానుకూల వాతావరణం కోసం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.

Vastu Tips: కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట!
New House Vastu Tips Telugu
Rajashekher G
|

Updated on: Nov 16, 2026 | 6:38 PM

Share

New House Vastu Tips Telugu: చాలామందికి సొంత ఇల్లు అనేది జీవితకాల స్వప్నం. ఆ కలను నిజం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడతారు. పైసా పైసా కూడబెట్టి తమకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేస్తారు. అయితే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత కొందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరిస్తే, మరికొందరి ఇళ్లలో మాత్రం అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. ఆర్థిక ఇబ్బందులు, అనవసర ఖర్చులు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వంటి సమస్యలు మొదలవుతాయని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే ముందు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని హిందూ సంప్రదాయాలు చెబుతున్నాయి. మరి కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఎలాంటి పనులు చేయాలి? వాస్తు శాస్త్రం ప్రకారం పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఏమిటో తెలుసుకుందాం.

1. ప్రధాన ద్వారం వద్ద వెండి వస్తువు ఉంచాలి

వాస్తు శాస్త్రంలో వెండికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వెండి పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు ప్రధాన ద్వారం గడప కింద చిన్న వెండి వస్తువును ఉంచాలని కొన్ని వాస్తు సంప్రదాయాలు సూచిస్తాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని, ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు.

2. ముందుగా దేవతల ఫోటోలు లేదా విగ్రహాలను ఏర్పాటు చేయాలి

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే ముందు పూజా మందిరాన్ని సిద్ధం చేసుకోవడం మంచిది. ముందుగా ఇంట్లో దేవదేవతల ఫోటోలు లేదా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేయాలి. అనంతరం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దైవానుగ్రహం లభించి, కుటుంబ సభ్యులకు సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఇవి కూడా చదవండి

3. గృహప్రవేశానికి ముందు అన్నదానం చేయాలి

హిందూ ధర్మంలో అన్నదానాన్ని మహాదానంగా పరిగణిస్తారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. అందుకే కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు పేదలకు, అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం మంచిదని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుందని, ఇంట్లో ధాన్యానికి, ఆహారానికి కొరత ఉండదని విశ్వాసం.

4. ఇంటిని శుభ్రం చేసి పవిత్రం చేయాలి

కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు ఇంటి ప్రతి మూలను శుభ్రం చేసుకోవాలి. సంప్రదాయం ప్రకారం గంగాజలాన్ని లేదా పవిత్ర జలాన్ని ఇంట్లో చల్లుతూ శుద్ధి చేస్తారు. దీనివల్ల ఇంట్లో పరిశుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని భావిస్తారు.

5. గృహప్రవేశ పూజ నిర్వహించాలి

కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు సంప్రదాయం ప్రకారం గణపతి పూజ, వాస్తు పూజ, హోమం నిర్వహించడం శుభప్రదంగా భావిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా కుటుంబం సంతోషంగా ఉండాలని గణపతిని ప్రార్థిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు వాస్తు శాస్త్రం, హిందూ సంప్రదాయాల్లో ఉన్న నమ్మకాలు, ఆచారాల ఆధారంగా అందించిన సూచనలు మాత్రమే. వీటిని పాటించడం వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం.)

మరిన్ని ఆసక్తికర జ్యోతిష్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
చలికాలంలో రోజుకో క్యారెట్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే
చలికాలంలో రోజుకో క్యారెట్ తింటే శరీరంలో జరిగే మార్పులు ఇవే
కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం
కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం
తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు..
తులం బంగారం లక్ష..? కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు..
OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTTలో వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
పొద్దున్నే లేవడం కష్టంగా ఉందా? మీ బాడీ క్లాక్‌ను ఇలా సెట్ చేయండి
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
యాప్‌లో పరిచయం.. గదిలో మత్తు.. ఆపై
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
నడిచేటప్పుడు ఇలా చేస్తున్నారా?.. మీ గురించి ఇంట్రెస్టింగ్ సైకాలజీ
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
ట్రాఫిక్ పోలీసులను చూసి లగెత్తాడు... పట్టుకుని తనిఖీ చేయగా షాక్
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
వృశ్చిక రాశిలో రవి.. వచ్చే నెల రోజులు వీరికి గోల్డెన్ డేస్..!
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్
హీరోయిన్ నజ్రియాకు ఇంత అందమైన చెల్లి ఉందా? పెళ్లి ఫొటోస్ వైరల్