AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: నాడు మావోయిస్టులు.. నేడు మోడళ్లు.. ఫ్యాషన్ ర్యాంప్‌పై రప్ఫాడించేశారు! వీడియోలు వైరల్‌..

సాధారణంగా మావోయిస్టు లేదా నక్సలైట్ అనే పదం వినగానే దట్టమైన అడవులు, చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు కలిగిన పోరాట యోధుల చిత్రమే గుర్తుకొస్తుంది. కానీ, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గురువారం కనిపించిన దృశ్యాలు ఆ పాత భావనను పూర్తిగా తుడిచిపెట్టాయి. ఒకప్పుడు బస్తర్ అడవులను ఏలిన మాజీ మహిళా నక్సలైట్లు ఇప్పుడు సమాజ మూలస్రవంతిలో కలసిపోయి, మోడల్స్‌లా మారిన అరుదైన ఘట్టం ఇక్కడ ఆవిష్కృతమైంది.

Watch: నాడు మావోయిస్టులు.. నేడు మోడళ్లు.. ఫ్యాషన్ ర్యాంప్‌పై రప్ఫాడించేశారు! వీడియోలు వైరల్‌..
Former Women Maoists,
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2026 | 5:30 PM

Share

సాధారణంగా మావోయిస్టు లేదా నక్సలైట్ అనే పదం వినగానే దట్టమైన అడవులు, చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు కలిగిన పోరాట యోధుల చిత్రమే గుర్తుకొస్తుంది. కానీ, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గురువారం కనిపించిన దృశ్యాలు ఆ పాత భావనను పూర్తిగా తుడిచిపెట్టాయి. ఒకప్పుడు బస్తర్ అడవులను ఏలిన మాజీ మహిళా నక్సలైట్లు ఇప్పుడు సమాజ మూలస్రవంతిలో కలసిపోయి, మోడల్స్‌లా మారిన అరుదైన ఘట్టం ఇక్కడ ఆవిష్కృతమైంది.

మావోయిస్టు లేదా నక్సలైట్ అనే పదం వినగానే మనకు గుర్తుకువచ్చేది దట్టమైన అడవులు, చేతిలో అత్యాధునిక ఆయుధాలు, నిరంతర పోరాటాలు. కానీ, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఈ పాత ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది. ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టిన మాజీ మహిళా మావోయిస్టులు, ఇప్పుడు ఆయుధాలను విడిచిపెట్టి మోడళ్లలా ఫ్యాషన్ ర్యాంప్‌పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇవి కూడా చదవండి

జనజీవన స్రవంతిలో నూతన అధ్యాయం:

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో దశాబ్దాల పాటు సాయుధ పోరాటాల్లో పాల్గొని, ఆ తర్వాత ప్రభుత్వ పునరావాస పథకాల ద్వారా లొంగిపోయిన మాజీ మహిళా మావోయిస్టులు సమాజ మూలస్రవంతిలో వేగంగా కలిసిపోతున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయ్‌పూర్‌లోని పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో ప్రత్యేక గిరిజన ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లొంగిపోయిన మహిళలు ఛత్తీస్‌గఢ్ ప్రత్యేకత అయిన చేనేత దుస్తులు, కోసా సిల్క్ చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. వారు ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేస్తుంటే ఆడిటోరియం చప్పట్లతో మార్మోగిపోయింది.

ఆయుధం వీడి.. ఆత్మగౌరవం వైపు:

ఈ వేడుక కేవలం ఒక ఫ్యాషన్ షో మాత్రమే కాదు. హింసామార్గాన్ని, బారికేడ్లను వీడి గౌరవప్రదమైన, ఆత్మనిర్భరమైన నూతన జీవితాన్ని ప్రారంభించిన మహిళల ఆత్మవిశ్వాసానికి ఇది ప్రతిరూపం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ఆ మహిళలతో ముచ్చటించి, వారి కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రోత్సహించారు.

సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ:

ఆగస్టు 7న జరిగిన ఈ వేడుకల వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ మార్పును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఇలాంటి దృశ్యాన్ని ఊహించడం కూడా కష్టం.. ఇది నిజమైన మహిళా సాధికారత అని ఒకరు కామెంట్ చేయగా, వారసత్వ హింసను వదిలి మూలస్రవంతిలోకి రావడం అభినందనీయం, వారిలో ఏ కోశానా మాజీ మావోయిస్టుల భావన కనిపించడం లేదు అని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

హింసాత్మక గతం నుండి స్వయంసమృద్ధి, ఫ్యాషన్ రంగం వైపు సాగిన ఈ మహిళల ప్రయాణం సమాజంలో రాబోయే గొప్ప మార్పుకు, పునరావాస కార్యక్రమాల విజయానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us