AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారం రోజులు ఇలా కొత్తిమీర జ్యూస్ తాగి చూడండి..? శరీరంలో జరిగే అద్భుతం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ప్రతి ఇంటా వంటగదిలో కొత్తిమీర, ధనియాలు తప్పనిసరిగా ఉంటాయి. వంటకాలకు చక్కని రుచిని, సువాసనను అందించే కొత్తిమీరను కేవలం సాధారణ ఆకుకూరగా మాత్రమే చాలామంది భావిస్తారు. కానీ, ఇది అనేక ఔషధ గుణాలు కలిగిన ఒక విశిష్టమైన మూలిక. నిత్యం కొత్తిమీరను లేదా దాని జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Aug 13, 2026 | 5:50 PM

Share
వంటకాలకు సువాసన, రుచిని ఇచ్చే కొత్తిమీర కేవలం అలంకరణకే కాకుండా ఆరోగ్యానికి మరియు అందానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పరగడుపున కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల చర్మ సమస్యలు తొలగి, మొటిమలు తగ్గి ముఖం మెరుస్తుంది. విటమిన్ కె, ఇ, ఎ లు పుష్కలంగా ఉండే కొత్తిమీర జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించడమే కాకుండా

1 / 5
చర్మానికి, జుట్టుకు సహజ సౌందర్యం: కొత్తిమీర జ్యూస్ చర్మాన్ని డీటాక్సిఫై చేసి, లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. ప్రతిరోజు ఉదయం ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గి సహజమైన మెరుపు సొంతమవుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ కె, విటమిన్ ఇ, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. కొత్తిమీరతో తయారుచేసిన హెయిర్ ప్యాక్స్ లేదా జ్యూస్ వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి, పొడవాటి, మందపాటి జుట్టు పెరుగుతుంది.

2 / 5
జీర్ణక్రియ మెరుగుదల, బాడీ డీటాక్స్: వేసవిలో లేదా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల శరీరం తక్షణమే చల్లబడుతుంది. ఇది టీ, కాఫీలకు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేసి ఆమ్లత్వం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నయం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ నిరోధక లక్షణాలను అందిస్తాయి.

3 / 5
షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణ: మధుమేహంతో బాధపడేవారికి కొత్తిమీర ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కొత్తిమీర శరీరంలోని అదనపు సోడియం, నీటిని బయటకు పంపడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

4 / 5
మెదడు చురుకుదనం, మానసిక ప్రశాంతత: కొత్తిమీర మెదడు కణాలను బలోపేతం చేసి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఆందోళన, నిరాశ వంటి మానసిక ఒత్తిళ్లను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గే అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారికి, మూర్ఛ వ్యాధి బాధితులకు కొత్తిమీర ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి, మీ రోజువారీ ఆహారంలో కొత్తిమీరను చట్నీ రూపంలోనో లేదా ఉదయాన్నే జ్యూస్ రూపంలోనో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన, అందమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.

5 / 5
Follow Us