ఈ పులావ్  ముందు ఏ నాన్ బిర్యానీలు పనికిరావు.. అప్పట్లో ఎగబడే వాళ్లు

Prasanna Yadla

09 september 2026

Pic credit - Pinterest

ఇది వరకు రోజుల్లో మన తాతలు ఇలా చేసుకుని తినే వాళ్ళు అందుకే వాళ్ళు ఇప్పటికి  బలంగా ఉన్నారు.

మష్రూమ్  పలావ్

 ఒక కప్పు బాస్మతి బియ్యం,  200 గ్రాముల మష్రూమ్స్ , 10 పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  10 పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర,  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. 

 కావలసిన పదార్థాలు

 ఒక దాల్చిన చెక్క , 4 లవంగాలు , రెండు యాలకులు , నాలుగు బిర్యానీ ఆకులు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి.

కావలసిన పదార్థాలు

ముందుగా  బియ్యాన్ని బాగా  కడిగి 10 నిమిషాల పాటు వీటిని బాగా  నానబెట్టి ఆ తరవాత ఈ నీరు వంపేసి పచ్చిమిర్చి, పుదీనా ఆకులు తీసుకోవాలి. 

స్టెప్ 1

అర కట్ట కొత్తిమీరను తీసుకుని దీనిలో నీరు పోసి దానిని మెత్తగా గ్రైండ్ పట్టుకుని  పేస్ట్ మాదిరి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.  

స్టెప్ 2 

ఆ తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయినా తరవాత దీనిలో ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, రెండు యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి  దీనిని బాగా వేయించాలి. 

స్టెప్ 3

ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కనీసం 5  నిమిషాలు పాటు బాగా  వేయించాలి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న  పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇంకో 4 నిమిషాలు కలుపుతూ బాగా వేయించాలి. ఇక చివరిగా దీనిలో  నానబెట్టిన బియ్యం కూడా  వేసి బాగా కలపాలి.

స్టెప్ 4

 ఇంకా దీనిలో రుచికి సరిపడా  ఉప్పు, తగినన్ని నీరు కూడా  పోసి బాగా కలపాలి.  అన్ని వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి. చివర్లో నిమ్మరసం కూడా చల్లి పలావ్‌ను కలిపి కిందకు దించుకోవడమే.

స్టెప్ 5