కర్ణాటకలోని కల్బుర్గి-విజయపుర హైవేపై ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సు డ్రైవర్ స్టీరింగ్ వదిలి, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, నిలబడి నడిపాడు. ఫలితంగా బస్సు పొలాల్లోకి దూసుకుపోయి పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు, కానీ ఈ ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.