AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ తప్పులు చేశారో..మీకు రీఫండ్‌ రాదు

ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ తప్పులు చేశారో..మీకు రీఫండ్‌ రాదు

Samatha J
|

Updated on: Sep 08, 2026 | 2:35 PM

Share

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు వేతన జీవులు కొన్ని తప్పులను నివారించడం అత్యవసరం. ఫామ్-16, ఏఐఎస్ వివరాలు సరిపోల్చకపోవడం, వడ్డీ ఆదాయం చూపకపోవడం, తప్పుడు ఐటీఆర్ ఫామ్ ఎంచుకోవడం, ఈ-వెరిఫికేషన్ చేయకపోవడం వంటివి రీఫండ్‌ను ఆలస్యం చేస్తాయి లేదా అందనివ్వవు. గడువు ముగియకముందే జాగ్రత్తగా ఫైల్ చేయండి.

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే గడువు సమీపిస్తున్నందున, వేతన జీవులు ముందస్తు ప్రణాళికతో ఉండటం చాలా ముఖ్యం. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే ఫైల్ చేయడం వల్ల తప్పులు దొర్లకుండా ఉంటాయి, రీఫండ్ కూడా త్వరగా వస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన అంశాలపై స్పష్టత కలిగి ఉండాలి. ఉద్యోగులకు కంపెనీలు అందించే ఫామ్-16 ఐటీఆర్ ప్రక్రియను సులువు చేస్తుంది. అయితే, ఐటీ పోర్టల్ లో లభించే ఏఐఎస్ తో ఫామ్-16 వివరాలను తప్పనిసరిగా సరిపోల్చుకోవాలి. వీటిలో తేడాలు ఉంటే రీఫండ్ ఆలస్యం అవుతుంది. ఏడాదికి పదివేలు దాటిన సేవింగ్స్ వడ్డీ ఆదాయాన్ని చూపించకపోతే తర్వాత ఐటీ నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఆదాయానికి తగినట్టుగా సరైన ఐటీఆర్ ఫామ్ ను ఎంచుకోవడం కీలకం. జీతం ద్వారా మాత్రమే ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-1, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లాభాలు ఉన్నవారు ఐటీఆర్-2 ఎంచుకోవాలి. చివరగా, ఆన్‌లైన్‌లో వివరాలు నింపిన తర్వాత తప్పకుండా ఈ-వెరిఫికేషన్ చేయాలి. ఫైల్ చేసిన 30 రోజుల్లోపు వెరిఫై చేయకపోతే ఆ రిటర్న్ చెల్లదు. పోర్టల్ ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి గడువు తేదీ వరకు ఆగకుండా ముందస్తుగానే ఐటీఆర్ పూర్తి చేసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ రీఫండ్ సకాలంలో వస్తుంది.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?

Follow Us