AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైరెక్టర్‌ అవుదామనుకున్నాడు.. కట్‌ చేస్తే దొంగయ్యాడు!

డైరెక్టర్‌ అవుదామనుకున్నాడు.. కట్‌ చేస్తే దొంగయ్యాడు!

Samatha J
|

Updated on: Nov 05, 2026 | 12:14 PM

Share

సినిమా దర్శకుడిగా రాణించాలనే కలలు కన్న కడియం ప్రశాంత్, అవకాశాలు రాక విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి రైళ్లలో దొంగతనాలు మొదలుపెట్టాడు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ల్యాప్‌టాప్‌లను లక్ష్యంగా చేసుకున్నాడు. పలు చోరీల అనంతరం సాంకేతిక ఆధారాలతో నల్లగొండ రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

సినిమా రంగంలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనేది ఆ యువకుడి కల. ఉన్నత చదువులు చదివినా, వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. కానీ అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడం, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటంతో అడ్డదారి తొక్కాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా క్రియేటివ్‌గా ఆలోచించాల్సిన మైండ్‌ను, రైళ్లలో దొంగతనాలు చేయడానికి ఉపయోగించాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు.ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన కడియం ప్రశాంత్ బీటెక్ పూర్తి చేశాడు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సరైన అవకాశాలు దక్కకపోవటంతో ఈజీగా డబ్బు సంపాదించేందుకు రైలు ప్రయాణికులను టార్గెట్ చేయటం మొదలు పెట్టాడు. ముఖ్యంగా ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ల్యాప్‌టాప్ బ్యాగులను దొంగిలించటమే పనిగా పెట్టుకున్నాడు. గత నెల 30న సికింద్రాబాద్ నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న రామకృష్ణ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిద్రిస్తుండగా, బెర్త్ కింద ఉన్న ఆయన ల్యాప్‌టాప్ బ్యాగును ప్రశాంత్ ఎత్తుకెళ్ళాడు. అలాగే అక్టోబర్ 31న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అరవింద్ అనే మరో టెక్కీ ల్యాప్‌టాప్‌ను కూడా ఇదే తరహాలో చోరీ చేశాడు.

మరిన్ని వీడియోల కోసం :

షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?

బాలీవుడ్ స్టార్స్‌లో ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక హీరోలు!

బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష.. బడ్జెట్ కటింగ్స్‌పై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్

కత్తెరకు మరింత పదును పెట్టిన సెన్సార్ బోర్డ్‌

రిలీజ్ డేట్స్, ఓటీటీ అగ్రిమెంట్లపై సెన్సార్ ఎఫెక్ట్.. దర్శక నిర్మాతల నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Follow Us