AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వేస్టేషన్‌లో కొండలా పేరుకపోయిన డబ్బులు.. లెక్కించలేక అలసిపోయిన మిషన్

రైల్వేస్టేషన్‌లో కొండలా పేరుకపోయిన డబ్బులు.. లెక్కించలేక అలసిపోయిన మిషన్

Samatha J
|

Updated on: Nov 05, 2026 | 2:21 PM

Share

పశ్చిమ బెంగాల్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం భారీ నగదు పట్టుబడింది. రైల్వే పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఏకంగా రూ.1 కోటి 40 లక్షల నగదు బయటపడటంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. అసలు వివరాల్లోకి వెళ్లితే.. రైల్వే స్టేషన్‌లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి మూడు బ్యాగులను పట్టుకొని భయం భయంగా వెళ్తుండటంతో అతన్ని గమనించిన పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకోవడానకి ప్రయత్నం చేశాడు.

దీంతో పోలీసులు అతన్ని పట్టుకొని అనుమానంతో తనిఖీ చేయగా, బ్యాగులో కట్టల కొద్ది డబ్బులు కనిపించడంతో అధికారులతో పాటు అక్కడ ఉన్న ప్రయాణీకులు సైతం ఆశ్చర్యపోయారు. దాదాపు 500 నోట్ల కట్టలు 280 ఉండటంతో లెక్కించడానికి మెషిన్ తీసుకొచ్చి రైల్వే స్టేషన్‌లోనే ఆ డబ్బును లెక్కించారు. దీంతో బ్యాగులో మొత్తం రూ.1 కోటి 40 లక్షల నగదు ఉన్నట్లు వెల్లడి అయ్యింది. ఇక ఆ డబ్బు కట్టలను లెక్కించలేక ఆ యంత్రమే అలసి పోయినట్లు కనిపించింది. అంత డబ్బు ఉంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నించగా తన పేరు హౌరాలోని జీటీ రోడ్‌కు చెందిన రాహుల్ సోనీ (36) తెలిపారు. విచారణలో అతడు ఈ డబ్బును జార్ఖండ్‌లోని టాటానగర్ నుంచి హౌరాకు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే ఈ డబ్బు ఎవరిది? ఎవరు ఇచ్చారు? ఎందుకు తీసుకెళ్తున్నాడు? అనే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయాడని అధికారులు తెలియజేయడం జరిగింది. దీనిపై పోలీసులసు విచారణ చేపట్టారు.

Follow Us