గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
అర్నబ్ తుఫానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు ప్రభుత్వం గొప్ప ఊరట కల్పించింది. విద్యుత్, కమ్యూనికేషన్ సమస్యల కారణంగా గ్యాస్ సిలిండర్ డెలివరీలో ఎదురైన ఇబ్బందులను తొలగిస్తూ, తాత్కాలికంగా ఓటీపీ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అర్నబ్ తుఫాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇటీవల ఏపీని వణికించిన అర్నబ్ తుఫాను తీవ్ర బీభత్సం సృష్టించింది. పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్‌వర్క్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో తప్పనిసరి అయిన ఓటీపీ ధృవీకరణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు ఓటీపీ అందుకోలేక సిలిండర్లు తీసుకోలేకపోయారు.ఈ సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. ఆయన చొరవతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో ఓటీపీ నిబంధన నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. దీంతో నెట్‌వర్క్ సమస్యలతో సంబంధం లేకుండా వినియోగదారులు నేరుగా నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందే వెసులుబాటు కలిగింది. బాధితులు వంటగ్యాస్ కొరతను ఎదుర్కోకుండా ఈ సడలింపు ఎంతగానో తోడ్పడుతుంది. ఈ మినహాయింపు కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా పునరుద్ధరించబడే వరకు కొనసాగుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
బాలీవుడ్ స్టార్స్‌లో ప్రాణభయం.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల వెనుక హీరోలు!
బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష.. బడ్జెట్ కటింగ్స్‌పై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్
కత్తెరకు మరింత పదును పెట్టిన సెన్సార్ బోర్డ్
రిలీజ్ డేట్స్, ఓటీటీ అగ్రిమెంట్లపై సెన్సార్ ఎఫెక్ట్.. దర్శక నిర్మాతల నెక్ట్స్ స్టెప్ ఏంటి?
గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఇక ఓటీపీతో పని లేదు!
ఆ ఇల్లే ఒక పాముల పుట్ట.. అడుగడుగునా పాము గుడ్లే!
చదువు నేర్పిన గురువుకు అరుదైన గౌరవం!
కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు!
48 ఏళ్లుగా నీళ్లే తాగలేదట.. మరి ఏం తాగారో తెలుసా!
కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు
వరద ఉధృతికి పడవలా కొట్టుకుపోయిన లారీ..

