ఝాన్సీలో రీల్స్ కోసం పహుజ్ డ్యామ్‌లో 30 అడుగుల ఎత్తు నుంచి దూకి పుష్పేంద్ర కుమార్ అనే యువకుడు రెండు కాళ్లు విరగొట్టుకున్నాడు. నీరు లోతు తక్కువగా ఉండటంతో రాళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి ప్రమాదకర స్టంట్స్‌తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీక్షణలు, లైక్‌ల కోసం ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు.