Lavanya Tripathi: నటి లావణ్య త్రిపాఠి కొణిదెల తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో పర్పుల్ క్రేయాన్ అనే ఖాతా వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెడుతోందని ఆమె ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.